Nestham Movie Creations

Saturday, 19 November 2016

నోట్ల రద్దుపై విద్యాబాలన్ ఏమందంటే..?


ముంబై: పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ నటి విద్యాబాలన్, మరో నటుడు వివేక్ ఒబెరాయ్ తన అభిప్రాయాలను బయటపెట్టారు. ముంబైలో నిర్వహించిన గ్లోబల్ సిటిజెన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న వీరు ప్రధాని నిర్ణయాన్ని కొనియాడారు. పెద్ద నోట్లు రద్దు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారని అయితే వచ్చే నెలనాటికి పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటాయని విద్యాబాలన్ ఆశాభావం వ్యక్తం చేసింది. మోదీ చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రతి ఒక్కరు అంటున్నారని పేర్కొంది. అయితే కొంచెం ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని చెప్పింది. నటుడు వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ ఆరోగ్యం బాగాలేక వైద్యుడు వద్దకు వెళ్తే చేదు మాత్ర ఇస్తాడని, అంతమాత్రాన వైద్యుడిని తిడతామా? అంటూ తనదైన శైలిలో పేర్కొన్నాడు. అయితే మోదీ తీసుకున్న నిర్ణయం మాత్ర కాదని, ఇంజెక్షన్ లాంటిదని అభివర్ణించాడు.

No comments:

Post a Comment

About

Flickr