Nestham Movie Creations

Tuesday, 15 November 2016

పాతనోట్లతో సినిమా చూడొచ్చంటూ ఆఫర్


అందరూనడిచే బాటలో నడిస్తే ఏం బాగుంటుంది? భిన్నంగా ట్రై చేసినోళ్లంతా ఎంతోకొంత విజయాన్ని సాధించినోళ్లే. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మినట్లుగా కనిపిస్తోంది కన్నడ సినిమా ఒకటి. ప్రదాని మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుతో సినిమా పరిశ్రమకు భారీ దెబ్బ పడి.. కలెక్షన్లు డల్ అయిపోతున్నాయన్న ఆవేదన వ్యక్తమవుతున్న వేళ.. ప్రేక్షకులకు ఊరట కలిగించే ఒక మాటను చెప్పుకొచ్చారు ‘నటరాజ సర్వీస్’ నిర్మాత. ఈ నెలలో విడుదలయ్యే తమ సినిమాను పాత రూ.500 నోట్లతో చూడొచ్చని.. పాత నోట్లను చెల్లించి తమ సినిమా టిక్కెట్లు కొనుక్కోవచ్చని ఆఫర్ గా ప్రకటించారు. నటుడు శరణ్ నటించిన ఈ సినిమాకు పాత నోట్లతో టిక్కెట్లన్న ఆఫర్ ఎంతవరకు వర్క్ వుట్ అవుతుందో చూడాలి. ప్రభుత్వం పెద్దనోట్లు చెల్లవన్న తర్వాత కూడా వాటి చెల్లుబాటుపై నిర్మాత చేస్తున్న ప్రకటనతో ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేకుంటే.. టాలీవుడ్ నిర్మాత ఎవరో ఒకరు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని.. తన సినిమాకు ఇదే తరహా ప్రచారం చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. పాత నోట్లతో కొత్త సినిమాను చూసేందుకు ఎంతమంది ఆసక్తి ప్రదర్శిస్తారో చూడాలి

No comments:

Post a Comment

About

Flickr