తాను భోజన ప్రియురాలినని.. సమయానికి తనకు కడుపులో తిండి పడకపోతే తన భర్తతో విడాకుల వరకూ వెళ్లిపోతానని చమత్కరించింది మంచు లక్ష్మి. ఫుడ్ విషయంలోతన భర్తతో చాలా సార్లు గొడవ పడినట్లు ఆమె వెల్లడించింది. ‘‘కోటి విద్యలు కూటి కోసమే. మా ఇంట్లో అందరం భోజన ప్రియులం. సమయానికి పొట్టలో తిండి పడకపోతే ప్రళయం వచ్చేస్తుంది. నేనైతే విడాకుల దాకా వెళ్లిపోతా. మా ఆయనతో అలాంటి గొడవలు కూడా జరిగాయి. ఒకసారి మా ఆయనకు..‘నేను ఆకలిగా ఉన్నపుడు నేనన్న మాటలన్నింటికీ సారీ. అవన్నీ ఉద్దేశపూర్వకంగా అన్నవి కావు’ అని ఇంగ్లిష్ కొటేషన్ ఉన్న పోస్టర్ ఒకటి ప్రెజెంట్ చేశాను. ‘‘మంచి సెలెక్షన్.. నీ గురించి బాగా చెప్పావు’’ అని ఆయన మెచ్చుకున్నారు అని లక్ష్మి చెప్పింది. ఇక తాను అమెరికాలో చదువుకుంటూ.. టీవీషోలు చేసుకుంటూ ఉండి.. ఉన్నట్లుండి తెలుగు పరిశ్రమ వైపు రావడం గురించి లక్ష్మి స్పందిస్తూ.. ‘‘నేను విష్ణు పెళ్లికి వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్లందరం కూర్చుని మాట్లాడుకుంటుండగా ఓఫ్రా విన్ ఫ్రే టాక్ షోలాంటిది చేయాలని ఉందని క్యాజువల్‌గా అన్నా. ఆ మాటలను జీ టీవీకి చెందిన సంజయ్ విన్నారు. ఆయన విష్ణుతో మాట్లాడారు. విష్ణు నా దగ్గరికి వచ్చి 13 ఎపిసోడ్లే కదా చెయ్యి.. డబ్బులు వస్తాయి అన్నాడు. పైగా తమతో కొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చని కూడా చెప్పాడు. అలా జీటీవీలో ‘లక్ష్మీ టాక్ షో’ మొదలైంది. తర్వాత వెంటవెంటనే అవకాశాలు వచ్చాయి. సినిమాల్లోకి కూడా వచ్చా. మొదట్లో ఆరు నెలలు అమెరికాలో.. ఆరు నెలలిక్కడ.. ఉండేదాన్ని. తర్వాత అమెరికాలో మూడు నెలలే ఉండే వరకు వచ్చింది. ఇప్పుడేమో అమెరికా వెళ్లి ఏడాదిన్నర దాటిపోతోంది’’ అంటూ నవ్వేసింది లక్ష్మి

endi goram
ReplyDelete