Nestham Movie Creations

Saturday, 12 November 2016

సానియా.. నీ అందం సాహో సావరియా..!


అందం అంటే హీరోయిన్ల సొత్తు మాత్రమే కాదు.. మేం కూడా అందగత్తెలమే..! మా దగ్గర కూడా కావాల్సినంత అందం ఉంది చూసుకోండి.. అంటూ కసిగా చూస్తున్నట్లు ఉంది కదా ఈ ఫోటో..! పేరుకు టెన్నిస్ స్టార్ అయినా.. హీరోయిన్ కంటే ఎక్కువ ఇమేజ్ సంపాదించుకుంది సానియా మీర్జా. దానికి తోడు ఈ మధ్య కాలంలో విజయాలు కూడా బాగా పలకరించడంతో సానియా ఇమేజ్ మరింత పెరిగిపోయింది. ఈ భామను ఎప్పట్నుంచో సినిమాల్లోకి తీసుకురావాలని చాలా మంది దర్శకనిర్మాతలు ట్రై చేస్తున్నారు గానీ అది సాధ్యపడటం లేదు. కానీ సినిమాలకు దూరంగా ఉన్నా.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో రచ్చ లేపేస్తుంది సానియా మీర్జా. స్టార్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా.. చిట్టిపొట్టి దుస్తుల్లో సెగలు పుట్టించేస్తుంది ఈ బ్యూటీ. అలాంటిదే ఈ ఫోటో కూడా. మొత్తానికి సానియా అందం చూసిన తర్వాత.. ఎవ్వరైనా ఆమె అందానికి సాహో అనేసి సావరియా అని మైమరిచిపోవాల్సిందేనేమో..

1 comment:

About

Flickr