Nestham Movie Creations

Friday, 18 November 2016

నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే.. అగ్ర హీరోతో కత్రినా కైఫ్!


కత్రినా కైఫ్.. సల్మాన్ ఖాన్ ప్రేయసిగా, బాలీవుడ్ అందాల బొమ్మగా అందరికీ సుపరిచితం. అయితే, సల్మాన్‌తో ప్రేమాయణం బెడిసికొట్టడం యువ హీరో రణబీర్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం, అటుపై బ్రేక్ అప్ అవడం బాలీవుడ్‌లో ఒక సంచలనమనే చెప్పాలి. రణబీర్‌తో బ్రేక్ అయిన తరువాత కత్రినా తీవ్ర ఒత్తిడికి లోనయిందని, ఈ సమయంలో సల్మాన్ భాయ్ తోడుగా నిలిచాడని దాంతో, తిరిగి సినిమాల్లో తన పూర్వపు సత్తా చాటుతోందని వార్తలు వెంటవెంటనే వచ్చేశాయి. అయితే, తాజాగా బాలీవుడ్‌లో ఒక షాకింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ జంట బ్రేక్ అప్ అయినప్పటికీ, చాలా రహస్యంగా కలుసుకుంటున్నారని, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా రణబీర్‌ను కత్రినా తీవ్ర ఒత్తిడి చేస్తోందనేది సమాచారం. అయితే, రణబీర్ మాత్రం ససేమిరా అంటున్నట్లు చెప్పుకుంటున్నారు. దీనంతటికీ కారణం కత్రినా తన సినిమా ప్రచారానికి సల్మాన్ ఖాన్ షోను ఉపయోగించుకోవడమేనని కూడా టాక్. అంతేకాదు, ఈ జంట కలుసుకోవడానికి సహాయం చేస్తోంది బీ టౌన్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ అని, అది కూడా కరణ్ ఇంట్లోనే ఈ జంట కలుసుకుంటున్నారని సమాచారం.

No comments:

Post a Comment

About

Flickr