Nestham Movie Creations

Saturday, 12 November 2016

ఆ హీరో ఇక కోలుకోవడం కష్టమే

ఆ హీరో ఇక కోలుకోవడం కష్టమే
ప్రస్తుతం టాలీవుడ్లో వారసుల హవా నడుస్తోంది. 80 శాతం హీరోలు వాళ్లే ఉంటున్నారు. వీరిలో చాలా వరకు సక్సెస్ అయిన వాళ్లే. ఒకట్రెండు సినిమాలు ఫ్లాప్ అయినా సరే.. మళ్లీ మళ్లీ ప్రయత్నించి సక్సెస్ అవుతున్నారు. బాగా కష్టపడి తమ టాలెంటు చాటుకుంటున్నారు. ఐతే బ్యాకప్ ఉన్నంత మాత్రాన అందరూ హీరోలుగా నిలదొక్కుకుంటారని కూడా అనుకోవడానికి లేదు. ఇందుకు తారకరత్న లాంటి వాళ్లు ఉదాహరణగా నిలుస్తారు. అతను దశాబ్దంన్నర నుంచి పోరాడుతున్నా సక్సెస్ రుచి చూడలేదు. ఇక తారకరత్న తర్వాత అంత బ్యాడ్ లక్ ఉన్న హీరో నాగార్జున మేనల్లుడు సుశాంతే అని చెప్పాడు. సుశాంత్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు దశాబ్దం అయిపోతోంది. సినిమా సినిమాకు మూడేళ్ల గ్యాప్ తీసుకుంటున్నాడు. జాగ్రత్తగా కాంబినేషన్లు సెట్ చేస్తున్నాడు. స్క్రిప్టు మీద.. షూటింగ్ కోసం చాలా టైం స్పెండ్ చేస్తున్నాడు. కానీ సక్సెస్ మాత్రం అతడి గుమ్మం తొక్కట్లేదు. కాళిదాసు.. కరెంట్.. అడ్డా.. ఒకదాన్ని మించి ఇంకోటి ఫ్లాపులైతే.. సుశాంత్ లేటెస్ట్ మూవీ ‘ఆటాడుకుందాం రా’ వాటన్నింటినీ మించిపోయింది. ఫస్ట్ షో నుంచే పూర్తి నెగెటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమాకు అసలు ఓపెనింగ్సే లేవు. ఫ్లాపుల్లో ఉన్నోళ్లకు హిట్టు ప్రసాదిస్తాడని పేరున్న నాగేశ్వరరెడ్డి కూడా సుశాంత్ ను కాపాడలేకపోయాడు. సినిమా ఫ్లాపవడానికి తోడు.. సుశాంత్ యాక్టింగ్ స్కిల్స్.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. డిక్షన్ అన్నింటి మీదా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికే పోరాడి పోరాడి అలసిపోయిన సుశాంత్.. ఇక హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టమన్నట్లే ఉంది పరిస్థితి.

No comments:

Post a Comment

About

Flickr