Nestham Movie Creations

Thursday, 17 November 2016

అనసూయ 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' బ్రేక్ ఎందుకు? ఐటమ్ సాంగ్ చేస్తూ బిజీనా?


anasuyaanasuya అనసూయ బాగా బిజీ అయిపోయింది. క్షణం సినిమా తర్వాత బుల్లితెర కార్యక్రమాలు చేస్తూనే వెండితెర ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ టీవీ ఛానెల్‌లో ఆమె 'ఏ డేట్‌ విత్‌ అనసూయ' అనే ప్రోగ్రామ్‌ ప్రారంభించింది. సెలబ్రిటీలను తీసుకువచ్చి 'కాఫీ విత్‌ కరణ్‌' తరహాలో కొన్ని ఎపిసోడ్‌లు చేసింది. అయితే మూడు వారాలుగా ఆ ప్రోగ్రామ్‌ రావడం లేదు. ఇందుకు కారణం అనసూయ బిజీ కావడమేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సాయిధరమ్‌ హీరోగా చేస్తున్న 'విన్నర్‌'లో ఓ ఐటెం సాంగ్‌ చేస్తోంది. ఆ పాట షూటింగ్‌ ఉక్రెయిన్‌లో జరుగుతోంది. అందకోసమే ఈ ప్రోగ్రామ్‌కు విరామం ప్రకటించిందని సమాచారం. మరోవైపు ఆ ప్రోగ్రామ్‌కు అనుకున్నంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌లు రావడం లేదని, అందుకే దానిని ఆపేశారని వదంతులు వినబడుతున్నాయి. వీటిలో ఏది నిజమో మరి..

No comments:

Post a Comment

About

Flickr