Nestham Movie Creations

Friday, 11 November 2016

అందుకే నారాయణమూర్తితో మాటల్లేవ్.. 18 ఏళ్లున్నప్పుడు తాక రాని చోట తాకితే?: ఝాన్సీ లక్ష్మీభాయ్‌


యాంకర్‌గా, నటీమణిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్రవేసుకున్న ఝాన్సీ లక్ష్మీభాయ్‌కి ఆర్ నారాయణమూర్తికి మధ్య విబేధాలు తెలిసిందే. ధైర్యంగా మాట్లాటంలో ఎప్పుడూ ముందుండే ఝాన్సీ లక్ష్మీభాయ్.. తెలుగులో శాటిలైట్‌ ఛానెల్స్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు టాప్‌ యాంకర్‌గానే కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఝాన్సీ లక్ష్మీభాయ్‌ మాట్లాడుతూ.. గతంలో నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తితో జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చింది. గతంలో నారాయణమూర్తి నిర్మిస్తూ.. దర్శకత్వం వహించే సినిమాలో ఓ రోల్ కోసం తనను తీసుకున్నారు. క్లైమాక్స్‌లో ఫైట్‌ కూడా చేసి సినిమాను లీడ్‌ చేసే మంచి క్యారెక్టర్‌ అని కూడా చెప్పారు. అయితే షూటింగ్ పూర్తి చేశాక తన క్యారెక్టర్‌ను చంపేశారు. ఏమని అడిగితే నారాయణ మూర్తి సెట్లో నలుగురితో కూర్చుని మాట్లాడటం.. ఇష్టం లేక క్యారెక్టర్‌ను చంపేసినట్లు వెటకారంగా సమాధానమిచ్చారు. అంతే తాను షూటింగ్ స్పాట్ నుంచి వాకౌట్ చేశానని.. ఇప్పటివరకు నారాయణ మూర్తి మాట్లాడిన సందర్భాలు లేవని ఝాన్సీ లక్ష్మీభాయ్‌ చెప్పుకొచ్చింది. అలాగే తను 18 ఏళ్ల వయసులో ఉండగా ఓ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ తనను తాకరాని చోట తాకాడాని, వెంటనే అతని పరువు తీసేశానని ఝాన్సీ లక్ష్మీభాయ్‌ వెల్లడించింది. ఆడవాళ్లను తక్కువ చేసే విధంగా ఉన్న ఓ డైలాగ్‌ విషయంలో దర్శకుడు సంపత్‌ నందితో కూడా గతంలో విభేదించానని, తర్వాత ఆయన అర్థం చేసుకుని డైలాగ్‌ మార్చాడని ఝాన్సీ లక్ష్మీభాయ్‌ వెల్లడించింది. వెబ్ మీడియాలో రాసే రూమర్ల గురించి పెద్దగా పట్టించుకోనని.. సోషల్ మీడియాలో తనను నానా మాటలంటూ రాశారు. ఇంకా వెబ్ జర్నలిజం కట్ కాపీ పేస్ట్ అని ఝాన్సీ లక్ష్మీభాయ్‌ తెలిపింది.

No comments:

Post a Comment

About

Flickr