Nestham Movie Creations

Sunday, 6 November 2016

చైనా కోతి జోస్యం.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంపేనట... ముద్దుపెట్టి మరీ చెప్పింది


china monkeychina monkey చైనా కోతి కూడా జోస్యం చెపుతోంది. గతంలో అక్టోపస్ పాల్ జోస్యం చెప్పినట్టుగానే ఈ కోతి కూడా జోస్యం చెపుతోంది. అక్టోపస్ పాల్ 2010 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అంతిమ విజేత ఎవరో ముందుగానే జోస్యం చెప్పింది. అలాగే, చైనా కోతి కూడా ఇపుడు అమెరికా అధ్య
క్షుడు ఎవరో జోస్యం చెప్పింది. ఈ కోతి పేరు 'గెడా'. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ల కటౌట్లను గెడా ముందు ఉంచారు. ఇద్దరి కటౌట్లను కాసేపు చాలా తీక్షణంగా చూసిన గెడా... చివరకు ట్రంప్ కటౌట్‌ను కౌగిలించుకుని, ఆయనకు ముద్దు పెట్టింది. ఈ రకంగా, ట్రంపే అంతిమ విజేత అని తేల్చేసింది. మరో విషయం ఏమిటంటే... ఈ యేడాది జరిగిన యూరోపియన్ సాకర్ ఛాంపియన్ షిప్‌లో కూడా విజేత ఎవరో గెడా ముందుగానే చెప్పింది. ఛాంపియన్‌గా పోర్చుగల్ గెలుస్తుందని గెడా చెప్పిన జోస్యం నిజమైంది. దీంతో, ట్రంప్ గెలవడం కూడా ఖాయమని అందరూ భావిస్తున్నారు

No comments:

Post a Comment

About

Flickr