Nestham Movie Creations

Saturday, 12 November 2016

షవర్‌ పిక్స్‌తో పనవుతుందా?

షవర్‌ పిక్స్‌తో పనవుతుందా?
అప్పటి హాట్‌నెస్ తనలో ఇప్పటికీ ఉందని చెప్పుకోడానికి అమీషా పటేల్ పాట్లు పడుతోందా? కొత్త చిత్రం 'భయ్యాజీ సూపర్‌హిట్‌'ను హిట్‌ చేసి తీరాలన్న కసి మీద ఉందా? హాట్ పిక్స్‌తో జనాలను థియేటర్స్‌కు రప్పించేయాలని అనుకుంటోందా? ఈ ఫొటో చూస్తుంటే ఇలాంటి డౌట్స్ రాక మానవు. ఈ ఒడీషా బ్యూటీ ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లోనే కనిపించింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ల్లోనూ మెరిసింది. అయితే ఛాన్సులు లేకపోవడంతో అమీషా అంటూ ఓ నటి ఉందని జనాలు మరిచిపోయారు. ఈ తురుణంలో ఆమె 'భయ్యాజీ సూపర్‌హిట్‌'తో తెరపైకి వస్తోంది. మూడేళ్ల క్రితం వచ్చిన 'షార్ట్‌కట్ రోమియో' తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. 'భయ్యాజీ సూపర్‌హిట్‌'లో లీడ్‌ రోల్ సన్నీ డియోల్‌ది. అతడికి జోడీగా అమీషా కనిపించనుంది. ఈ మూవీలో ప్రీతి జింతా కూడా కనువిందు చేయనుంది. ఈ సినిమా గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఇలా అయితే పని కాదనుకుందో ఏంటో గానీ అమీషా తన షవర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వదిలింది. తనను తాను రాక్‌స్టార్‌గా పేర్కొంటూ ఈ హాట్ పిక్చర్‌కు క్యాప్షన్‌ కూడా పెట్టుకుంది. మూడేళ్ల తర్వాత వస్తున్న ఏకైక చిత్రం కాబట్టే అమీషా అన్ని అస్త్రాలూ ప్రయోగించేస్తోంది. మరిన్ని ఛాన్సులు చేజిక్కించుకునేందుకే ఈ కథక్ డ్యాన్సర్‌ షవర్ ఫొటోలను రిలీజ్‌ చేసింది. కూటి కోసం కోటి తిప్పలని నానుడి. కానీ అమీషా హంగామా చూసి.. ఛాన్సు కోసం కోటి తిప్పలని మార్చాలేమో?

No comments:

Post a Comment

About

Flickr