
మొత్తానికి ‘ప్రేమమ్’ సినిమా వచ్చేసింది. సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఫుల్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంచనాల్ని మించిపోయింది. ఈ సినిమాకు యువ దర్శకుడు చందూ మొండేటి ఇచ్చిన తెలుగు టచ్ సినిమాకు బలంగా నిలిచింది. ‘ప్రేమమ్’ కోసం చాలా అదనపు ఆకర్షణలు జోడించాడు చందూ. కథాకథనాల్లో చేసిన మార్పులైతేనేమీ.. వెంకీ, నాగార్జునల క్యామియో రోల్స్ అయితేనేమి.. అన్నీ కూడా చక్కగా కుదిరాయి. నాగార్జున వాయిస్ ఓవర్ కూడా సినిమాకు బలంగా నిలిచింది. టైటిల్స్ సందర్భంగా నాగార్జున ఇచ్చే ఇంట్రడక్షనే సినిమా మీద ఒక పాజిటివ్ ఫీల్ తీసుకొస్తుంది. చివర్లో నాగార్జున చైతూ తండ్రిగా ఎంట్రీ ఇచ్చి.. అక్కినేని అభిమానుల్ని అలరిస్తాడు.
ఐతే ఈ సినిమాలో చైతూ తల్లిగా నటించింది ఎవరో చూపించరు. కానీ వాయిస్ మాత్రం వినిపిస్తారు. ఓ సన్నివేశంలో చైతూ ఇంట్లోని తన రూంలో కూర్చుని తన ప్రేమ లోకంలో విహరిస్తుంటే.. వంట గది నుంచి తల్లి వాయిస్ వినిపిస్తుంది. ఆ వాయిస్ క్యారెక్టర్ ఆర్టిస్టు రజితది కావడం విశేషం. రజిత అంటే వెంటనే గుర్తు రాకపోవచ్చు. ‘అత్తారింటి దారేది’ సినిమాలో బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చినపుడు భాస్కర్ అంటూ చేయి చాచి అతణ్ని కౌగిలించుకోవడానికి వస్తుందే.. ఆమే రజిత. కొన్ని వందల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసింది రజిత. చైతూ తల్లి గొంతుగా వినిపించేది ఆమె వాయిస్సే అన్నమాట. తండ్రి ఎవరన్నది చివరిదాకా చూపించరు. ముగింపులో నాగ్ ఎంట్రీ ఇస్తాడు. అంటే నాగార్జున భార్యగా రజిత చేసినట్లన్నమాట. ఈ జోడీ ఆడ్‌గా అనిపిస్తుంది కదా. కేవలం వాయిస్ మాత్రమే వినిపించాలి అనుకున్నపుడు.. పరిచయం లేని గొంతు ఏదైనా ట్రై చేసి బాగుండేదేమో
No comments:
Post a Comment