Nestham Movie Creations

Saturday, 12 November 2016

సెన్సార్ బోర్డును ఉతికారేసిన హాట్ గ‌ర్ల్


సెన్సార్ బోర్డును ఉతికారేసిన హాట్ గ‌ర్ల్ఈ మ‌ధ్య సెన్సార్ బోర్డు తీరు త‌ర‌చుగా వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ప్ర‌హ్లాద్ నిహ్లానీ సెన్సార్ బోర్డు ఛైర్మ‌న్ అయ్యాక త‌లెత్తిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. జేమ్స్ బాండ్ మూవీ 'స్పెక్ట‌ర్‌'తో పాటు 'ఉడ్తా పంజాబ్' సినిమా సెన్సార్ విష‌యంలో తీవ్ర వివాదాలు చెల‌రేగాయి. చాలామంది నిహ్లానీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఐతే వాళ్లంద‌రినీ మించిపోయే రీతిలో సెన్సార్ బోర్డు ఛైర్మ‌న్ మీద విరుచుకుప‌డింది రాఖీ సావంత్‌. త‌న కొత్త సినిమా ‘ఏక్ కహాని జూలీ కీ’కి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆమె తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెన్సార్ బోర్డును మూసేయాల‌ని.. నిహ్లానీ స్థానంలో త‌న‌ను ఛైర్మ‌న్‌ను చేస్తే మ‌రింత బాగా ప‌ని చేస్తాన‌ని ఆమె వ్యాఖ్యానించింది. సెన్సార్ బోర్డు వాళ్లు నిర్మాత‌ల నుంచి డ‌బ్బులు తీసుకుంటున్నార‌ని ఆమె ఆరోపించింది. ‘‘సెన్సార్ బోర్డును వెంట‌నే మూసివేయాలి. పెద్ద నిర్మాతల నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వాళ్లు చేస్తున్నదేమీ లేదు. సెన్సార్ బోర్డు సభ్యులు చిన్న నిర్మాతల్ని వేధిస్తున్నారు. లంచం ఇవ్వాలని పబ్లిగ్గా డిమాండ్ చేస్తున్నారు. అక్కడున్నోళ్లు ఏమీ తెలియ‌దు. సెన్సార్ బోర్డు చైర్మన్ పదవి నుంచి నిహ్లానీని తప్పించాలి. ఆయనకు ఏమీ తెలియకుంటే పదవికి రాజీనామా చేయాలి. ఆ స్థానంలో నేను కూర్చుంటాను. ఆయ‌న కంటే సమర్థవంతంగా పనిచేయగలను. వాళ్లకు మా నిర్మాత‌లు డబ్బులు ఇవ్వనందుకే ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాలో నేను న‌టించాన‌నే ఇలా చేశారు. నేను బాలీవుడ్ స్టార్ న‌టిని. ఈ దేశ బిడ్డను. పోర్న్ స్టార్ కాదు. ఈ సినిమాలో అసభ్య దృశ్యాలు లేకున్నా ఎ స‌ర్టిఫికెట్ ఎందుకిచ్చారో చెక‌ప్పాలి. ఈ విషయంపై బాంబే హైకోర్టుకు వెళ్తున్నాం. సెన్సార్ బోర్డుకు గుణ‌పాఠం చెబుతాం’’ అని రాఖీ పేర్కొంది

No comments:

Post a Comment

About

Flickr