సౌదీ అరేబియా అంటే సంపదకు చిరునామా.. విలాసాలకు మారుపేరు. అయినా.. అక్కడ మహిళలకు మాత్రం అడుగడుగునా కష్టాలే. అలాంటి పురుషాధిక్య సౌదీ సమాజంలో ఇప్పుడు ఓ మహిళ విప్లవం వర్ధిల్లాలి అంటోంది. మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తుతోంది. ఈ క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆమె తన పోరాటాన్ని ఆపడం లేదు. సౌదీ అరేబియాలో సంచలనం సృష్టిస్తున్న ఆమె పేరు సొవాద్ అల్ షమ్మరి. ఆమె పేరు చెబితే ప్రభుత్వ పెద్దలూ హడలిపోతున్నారు. సౌదీ రాజధాని రియాద్ సమీపంలోని ‘హయిల్’ అనే గిరిజన ప్రాంతానికి చెందిన ఆమె తండ్రి రైతు కూలీ. పన్నెండు మంది సంతానంలో షమ్మరి పెద్దది. గొర్రెలమందను మేపడం ఆమె పని. అయితే షమ్మరి అలాగే ఉండిపోక వంశపారంపర్యంగా వస్తున్న ‘కచ్చేరి తీర్పరి’ (స్థానిక తగాదాలకు ఇస్లాం షరియత్ ఆధారంగా తీర్పు ఇచ్చే వ్యక్తి) గా పని చేసేది. ఇంతటితో ఆగని షమ్మరి హయిల్ యూనివర్సిటీ నుంచి ఇస్లామిక్ స్టడీస్ లో డిగ్రీ చేసి 17 ఏళ్ల వయసులో టీచరైంది. అనంతరం తనకంటే రెండింతల వయసు పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుని ఇరవై ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. విశేషం ఏమిటంటే ఈ విడాకుల వ్యవహారాన్ని చూసిన జడ్జీనే ఆమె రెండో వివాహం చేసుకుంది. ఆమె రెండో వివాహం చేసుకోవడంతో ఆమె మొదటి భర్త తన ద్వారా జన్మించిన కుమార్తెను తనకు అప్పగించాలని షరియత్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో షరియత్ చట్టం ప్రకారం సవతి తండ్రి కంటే సొంత తండ్రి దగ్గరే బాలిక పెరగడం శ్రేయస్కరమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ సమయంలో షమ్మరి ఎంత గొడవ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరుకి జడ్జి అయిన రెండో భర్త కూడా ఈ విషయంలో కల్పించుకోలేదు. దీంతో షరియత్ చట్టంలో మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు లేవని తొలిసారి గుర్తించి అప్పటి నుంచి తన పోరాటం ప్రారంభించింది. అందులో భాగంగా సోషల్ మీడియా ద్వారా ఒక ఉద్యమాన్ని నడిపిస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పలువురు ముస్లిం మత పెద్దలను విమర్శించడం మొదలెట్టింది. గడ్డంతో వున్న కరుడుగట్టిన కమ్యూనిస్టు ఫోటో ఒకటి ఆ పక్కనే స్టైలిష్ గా గడ్డం పెంచుకున్న మరో వ్యక్తి ఫోటో పోస్టు చేసి - 'పెద్ద పెద్ద గడ్డమున్న ప్రతి వారు పుణ్యాత్ములైపోరు' అని కామెంట్ పెట్టింది. ఇది కరుడుగట్టిన ముస్లిం దేశమైన సౌదీలో దుమారం రేపింది. ఆమెపై ముస్లిం మతపెద్దలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆమెను 2015 నవంబర్ లో అరెస్టు చేసి జైల్లో పెట్టి 2016 జనవరిలో విడిచిపెట్టారు. అయినప్పటికీ ఆమె పోరాటం ఆగలేదు. 'ఎందుకంటే.. నేను మనిషిని కనుక' అన్న పుస్తకాన్ని కూడా రాసింది. దాన్నీ అక్కడ నిషేధించారు.

No comments:
Post a Comment