
సౌత్ ఇండియాలో ఎవరు టాప్ హీరోయిన్.. ఎవరికి అత్యధిక ఫాలోయింగ్ ఉంది.. ఎవరు అత్యధిక పారితోషకం పుచ్చుకుంటున్నారు అనే విషయంలో క్లారిటీ లేకపోవచ్చు. కానీ ఇక్కడ అత్యంత గొప్ప మనసున్న హీరోయిన్ ఎవరు అంటే మాత్రం మరో మాట లేకుండా సమంత పేరు చెప్పేయొచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఎలా ఇన్‌స్పైర్ అయిందో కానీ.. హీరోయిన్ అయిన తొలి నాళ్ల నుంచే ఆమె గొప్ప దతృత్వ గుణం చూపిస్తోంది. ప్రత్యూష ఫౌండేషన్ పేరుతో ఓ స్వఛంద సంస్థ ఏర్పాటు చేసి.. ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో ప్రచారం కోసం హడావుడి చేయడం కాకుండా.. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎందరో అభాగ్యులైన చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపింది సమంత.
తాజాగా ఓ ప్రమాదంలో కాలు కోల్పోయిన చిన్నారికి మళ్లీ నడిచే భాగ్యం కల్పించింది సమంత. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా భవాని అనే ఐదేళ్ల చిన్నారికి కృత్రిమ కాలు అమర్చారు. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్లో ఈ శస్త్ర చికత్సను విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్ మంజుల ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు. ఈమె మొదట్నుంచి సమంత చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగమవుతోంది. డాక్టర్ మంజుల స్వతహాగా కూడా గొప్ప మానవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికే సేవా కార్యక్రమాల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సమంత. వందల కోట్లు సంపాదిస్తే మాత్రం ఏం ప్రయోజనం. ఇలా సంపాదనలో కొంత భాగం అభాగ్యుల కోసం ఖర్చు చేయడంలో ఉన్న సంత ప్తి ఏంటో సమంతకే తెలుసు. ఆమె గొప్ప మనసుకు మరోసారి హ్యాట్సాఫ్ చెబుదాం.
sam your superb
ReplyDelete