ఒంటి రంగును మార్చేస్తాయనే క్రీముల విషయంలో చాలా విమర్శలున్నాయి. రంగు తక్కువుండటం ఏదో నేరమైనట్లు చూపిస్తూ.. ఇలా ఆ క్రీమ్ రాయగానే అద్భుతాలు జరిగిపోతాయన్నట్లు యాడ్స్ చూపించడం పెద్ద మోసం. కంగనా రనౌత్ లాంటి వాళ్లు ఇలాంటి యాడ్స్ విషయంలో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఆమెకు భారీ పారితోషకం ఆఫర్ చేసినా కూడా ఆ యాడ్స్ చేయడానికి ఒప్పుకోలేదు. ఐతే తాజాగా రామ్ గోపాల్ వర్మ సైతం ఇలాంటి యాడ్స్ మీద తనదైన శైలిలో విమర్శలు గుప్పించాడు. ఫెయిర్ అండ్ లవ్లీని టార్గెట్ చేసుకుని ట్వీట్ పోరాటం మొదలుపెట్టాడు. ఫెయిర్ అండ్ లవ్లీని యామి గౌతమ్ బ్యూటిఫుల్‌గా మారిస్తే.. దాని తయారీ దారులు మాత్రం ఫెయిర్ అండ్ లవ్లీనే యామిని అందంగా మార్చిందన్నట్లు యాడ్‌లో చూపించడం పెద్ద స్కామ్ అని వ్యాఖ్యానించాడు వర్మ. ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నా వేసుకోకున్నా.. యామి అందంగానే ఉంటుందని.. అలాగే ఆ క్రీమ్ రాసుకున్నా అందంగా లేని వాళ్లు అలాగే ఉంటారు తప్ప ఏమీ మార్పు ఉండదని వర్మ అన్నాడు. అందమైన యామిని అందరహితమైన ఫెయిర్ అండ్ లవ్లీకి అప్లై చేయడం ద్వారా దాన్ని అందంగా మార్చారని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు వర్మ. నిజంగా అందంగా లేని వాళ్ల మీద ఈ క్రీమ్ ప్రయోగించి అందంగా మార్చగలిగితే అది అసలైన రుజువు అవుతుందని వర్మ అన్నాడు. ఫెయిర్ అండ్ లవ్లీ వాడటానికి ముందు తాను అందంగా లేనని.. ఇది వాడాకే తాను అలా తయారయ్యానని ట్విట్టర్లో స్టేట్మెంట్ ఇవ్వాలంటూ యామికి సవాలు విసిరాడు వర్మ. ఇవన్నీ తెలిసిన విషయాలే అయినా.. ఓపెన్‌గా మాట్లాడి ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ల గాలి తీసేసిన వర్మకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

No comments:
Post a Comment