
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు కాట్రవల్లీ అవుతుందనే కామెంట్లు వినబడుతున్నాయి. కాట్రవల్లీ అంటే ఇక్కడ అర్థం ఏంటయా అంటే.. ఈ చిత్రానికి అనుకున్నంత హైప్ రావడంలేదట. గతంలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ చిత్రాల మాదిరిగా దీనికి అంత స్థాయిలో ప్రాచుర్యం రావడం లేదని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. pawan kalyan
అంతేకాదు... ఈ చిత్రానికి క్రేజ్ రాకపోవడంతో బిజినెస్ కూడా అంతగా జరగడం లేదనీ, అనుకున్నస్థాయిలో డబ్బులు వచ్చేట్లు కనబడటం లేదని అనుకుంటున్నారు. దీనికి ముఖ్యకారణం దర్శకుడు డాలీయే కారణమని కూడా చెప్పుకుంటున్నారు. అదే త్రివిక్రమ్ వంటి దర్శకుడైతే మంచి హైప్ వచ్చేదని అనుకుంటున్నారట. మరోవైపు చిత్ర దర్శకుడితో పవన్ కళ్యాణ్‌కు తేడాలు వచ్చాయనే ప్రచారం జరుగుతుండటంతో అదో నెగటివ్ మచ్చ పడుతోంది. దీనితో పవన్ కళ్యాణ్ కూడా కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.
పైగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కు కాటమరాయుడు చిత్రం తెచ్చే లాభాలతో పూడుస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు కాటమరాయుడు కూడా కాట్రవల్లీలా మారడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పవన్ ఉన్నాడని చెప్పుకుంటున్నారు
No comments:
Post a Comment