Nestham Movie Creations

Tuesday, 8 November 2016

బిచ్చగాడు రికార్డును బద్ధలు కొట్టిన జనతాగ్యారేజ్.. ఎలాగంటే?


బిచ్చగాడి రికార్డును జనతాగ్యారేజ్‌ అధిగమించింది. దాదాపు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాది మేటి సినిమాల్లో ఒకటిగా నిలిచింది. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్‌కు లభించిన భారీ విజయమిది. ఇప్పటికే పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ చిత్రం మరో రికార్డును కూడా సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నింటిలోకి అత్యధిక టీఆర్పీ (20.69) సాధించి నంబర్‌ వన్‌గా నిలిచింది 'జనతాగ్యారేజ్‌. ఇప్పటిదాకా ఈ రికార్డు బిచ్చగాడి పేరిట ఉండేది. టీఆర్పీ రేటింగ్ బిచ్చగాడికి 18 పాయింట్స్ ఉండగా, జనతాగ్యారేజ్ ఆ రికార్డు అధిగమించింది. అయితే 'జనతాగ్యారేజ్‌' సినిమాకు ఇంతకంటే మంచి టీఆర్పీలే రావాల్సింది. ఎందుకంటే ఆ సినిమా విడుదలైన 50 రోజులకే టీవీల్లో వచ్చేసింది. కానీ ఆ రోజు భారత్‌-న్యూజిలాండ్‌ వన్డే మ్యాచ్‌ ఉండడం, పైరసీ సీడీలు అప్పటికే బయటకు వచ్చేయడంతో ఆ సినిమా అనుకున్నంత రేంజ్‌లో టీఆర్పీని సాధించలేకపోయింది.

No comments:

Post a Comment

About

Flickr