తెరమీద అద్భుతంగా కనిపించే యాక్షన్ దృశ్యాల వెనుక చాలా కష్టమే దాగి ఉంటుంది. వీటి కోసం హీరోలు.. విలన్లు కొన్నిసార్లు పెద్ద రిస్కులే చేస్తుంటారు. ఈ క్రమంలో సరైన జాగ్రత్తలు చేపట్టకపోతే ఎలాంటి ఘోరాలు జరుగుతాయో చెప్పడానికి కన్నడ సినిమా 'మస్తీగుడి' షూటింగ్ సందర్భంగా జరిగిన విషాదమే రుజువు. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఓ రిస్కీ షాట్ చిత్రీకరిస్తుండగా.. రెండు ప్రాణాలు పోయాయి. బెంగళూరు దగ్గర్లోని ఓ రిజర్వాయర్లో ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరిస్తుండగా ఘోరం చోటు చేసుకుంది. హెలికాఫ్టర్ నుంచి హీరో దునియా విజయ్ తో పాటు ఉదయ్.. అనిల్ అనే ఇద్దరు నటులు రిజర్వాయర్లోకి దూకే సన్నివేశం చిత్రీకరించారు. ముగ్గురూ హెలికాఫ్టర్ నుంచి దూకారు. ఐతే హీరో విజయ్ మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నాడు. మిగతా ఇద్దరూ రిజర్వాయర్లో మునిగి చనిపోయారు. ఉదయ్, అనిల్ల మృతదేహాలు కూడా ఇంకా దొరకలేదు. వాటి కోసం గాలింపులు జరుగుతున్నాయి. సరైన రక్షణ ఏర్పాట్లు ఏమీ చేయకుండానే ఈ సన్నివేశం చిత్రీకరించడంతో ఈ ఘోరం జరిగిపోయింది. ఉదయ్ కన్నడలో పేరున్న నటుడే. విలన్గా చాలా సినిమాల్లో నటించాడు. అతడితో పాటు అనిల్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ చిత్ర దర్శకుడు, నిర్మాతల మీద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

No comments:
Post a Comment