Nestham Movie Creations

Friday, 11 November 2016

స్టార్‌ హీరో కూతురి గ్లామర్‌ షో


స్టార్‌ హీరో కూతురి గ్లామర్‌ షోషారుక్‌ ఖాన్‌ కూతురు సుహాన భవిష్యత్తులో హీరోయిన్‌ అవుదామని అనుకుంటుందో లేదో తెలియదు కానీ మీడియాని మాత్రం తెగ ఆకర్షిస్తోంది. నిండా పదహారేళ్లు లేని ఈ పిల్ల రివీలింగ్‌ కాస్టూమ్స్‌తో వద్దన్నా మీడియా కళ్లల్లో పడుతూనే వుంది. తన కూతురి బికినీ ఫోటోలు అవీ వెబ్‌సైట్లలో పెడితే షారుక్‌కి నచ్చడం లేదు. కానీ షారుక్‌ తనయ బికినీలో వుందనే న్యూస్‌ పెడితే వచ్చే రెస్పాన్స్‌ని ఎవరు మాత్రం వదులుకుంటారు. పైగా సుహాన సగటు పదహారేళ్ల భారతీయ అమ్మాయిలా పద్ధతిగా బట్టలేసుకోవడాన్ని ఇష్టపడదు. ఆమె వేషధారణలో పాశ్చాత్త్య ధోరణి కొట్టొచ్చినట్టు కనిపిస్తూ వుంటుంది. పైగా తన ఫోటోలు తన దగ్గరే పెట్టుకుంటే వేరే సంగతి. వాటిని ఆన్‌లైన్‌లో పెడితే పబ్లిసిటీ ఇవ్వకుండా ఎలా వుంటారెవరైనా. షారుక్‌ మొదట్లో గింజుకున్నా కానీ ఇప్పుడు నెమ్మదిగా దీనికి అలవాటు పడుతున్నట్టు వున్నాడు. ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్‌లో ఏ స్టార్‌ కూతురిని చూసినా ఇదే తీరు. శ్రీదేవి కూతుళ్లు, అమితాబ్‌ మనవరాలు నిత్యం మీడియాలో నానుతూనే వుంటున్నారు. హీరోయిన్‌ అవుతుందో లేదో అనేది తెలియక ముందే ఈ రేంజ్‌ గ్లామర్‌ ప్రదర్శన అంటే ఇక హీరోయిన్‌ అయిందంటే అప్పుడెంత రచ్చ చేస్తుందో ఈ గడుగ్గాయి.

No comments:

Post a Comment

About

Flickr