ఒకానొక టైమ్‌లో బ్రహ్మానందం లేకపోతే తెలుగు సినిమా పూర్తయ్యేది కాదు. చాలా చిత్రాలని ఒంటి చేత్తో మోసేసిన బ్రహ్మానందం సడన్‌గా ఫామ్ కోల్పోయాడు. ఒక్కసారిగా తనకి తగ్గ పాత్రలు రాయడంలో రచయితలు విఫలమవుతున్నారు. అలాగే తనని బాగా వాడుకునే దర్శకులు సైతం చేతులెత్తేసారు. దీంతో బ్రహ్మానందంకి ఈమధ్య అవకాశం రావడమే ఎక్కువైపోయింది. కొత్త కమెడియన్లు పుట్టుకు రావడంతో బ్రహ్మానందంకి అంత పారితోషికం ఇచ్చుకోవడం దండగ అని నిర్మాతలు అతడిని కాంటాక్ట్ చేయడమే మానేసారు. తనలో పస ఇంకా అయిపోలేదని, ఇప్పటికీ అదిరిపోయే కామెడీ చేయగలనని నిరూపించుకోవడానికి బ్రహ్మానందం హీరో వేషం కడుతున్నాడు. ఇంతవరకు బాగానే వుంది. కానీ ఇందులో తన సరసన ఎవరైనా నవనవలాడే హీరోయిన్ వుండాలని బ్రహ్మీ తహతహలాడుతున్నాడు. గ్లామర్ లేకపోతే కామెడీ సినిమా అయినా చెల్లదని, అంచేత ఒక హాట్ హీరోయిన్‌ని పెట్టండని అడుగుతున్నాడు. బ్రహ్మీ కోరిక మీద అనసూయని కూడా అడిగి చూసారట. కానీ బ్రహ్మానందంతో రొమాన్స్ చేయడానికి ఆమె ఇష్టపడలేదట. ఎంత పారితోషికం ఆఫర్ చేసినప్పటికీ అనసూయ ఆసక్తి చూపించలేదట. బ్రహ్మానందం సరసన హీరోయిన్‌గా అంటేనే అందరూ వద్దు వద్దంటూ వెళ్లిపోతున్నారట. మరి తన సినిమాలో హాట్ హీరోయిన్ ఉండాలనే బ్రహ్మీ ముచ్చట తీర్చేదెవరో ఏమిటో?

No comments:
Post a Comment