హీరోగామారిన కమెడియన్ సప్తగిరి ఉన్నతమైన సంస్కారం కలిగినవాడని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. సప్తగిరి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. రోషిణి ప్రకాష్ కథానాయిక. అరుణ్ పవార్ దర్శకుడు. రవికిరణ్ నిర్మాత. విజయ్ బుల్గానిస్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. తొలిసీడీని పవన్ కల్యాణ్ ఆవిష్కరించి, సప్తగిరికి అందించారు. ఇందులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'శరత్ మరార్‌తో తీస్తున్న సినిమాకి ‘కాటమరాయుడు’ పేరు పెడదామనుకొన్నాం. ఆ సమయంలో ఆ టైటిల్ సప్తగిరి దగ్గరే ఉంది. ఆ విషయం నాకు తెలీదు. అడిగిన వెంటనే ఉన్నతమైన సంస్కారంతో ఆ టైటిల్ మాకు ఇచ్చారు. కానీ అప్పటికే వాళ్ల సినిమా 80 శాతం పూర్తయ్యింది. టైటిల్ తీసుకొన్నందుకు నాకే సిగ్గుగా అనిపించింది. వద్దన్నాను. కానీ వాళ్లే ఇచ్చారు' అని పవన్ తెలిపారు. ఇకపోతే... తాను సినిమాలు తక్కువగా చూస్తానని, తన సినిమాల్లో రెండు మూడు ఇప్పటికీ చూళ్లేదని, కానీ ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ మాత్రం చూడాలని ఉందన్నారు. సినిమా వేడుకలకు వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చేంతగా తనను తాను చూసుకోలేనన్నారు. కానీ అభిమానుల ప్రేమకు స్పందిస్తానని అన్నారు. సప్తగిరి ‘గబ్బర్‌సింగ్’లో చిన్న సన్నివేశంలో నటించాడని, అది చూసి విపరీతంగా నవ్వుకొన్నానని చెప్పారు. అప్పటి నుంచి అతణ్ని కలవాలనుకుంటే ఇప్పటికి కుదిరిందన్నారు. కాటమరాయుడు టైటిల్ ఇచ్చినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు

No comments:
Post a Comment