

చైన్నై: హీరో సూర్య సాధారణంగా చాలా హంబుల్ గా ఉంటారు. ఆయనతో ఎవరికి విభేధాలు ఉండవు. అలాంటిది ఆయన క్షమాపణ చెప్పాల్సిన పరిస్దితి రీసెంట్ గా ఓ స్టేజిపై వచ్చింది. అదీ ఓ సీనియర్ జర్నలిస్ట్ కు. ఇంతకీ సీనియర్ జర్నలిస్ట్ కు సూర్య ఎందుకు క్షమాపణ చెప్పారు. అసలేం జరిగిందనే విషయాలు చూద్దాం. రీసెంట్ గా సూర్య తండ్రి శివకుమార్ 75 వ జన్మదిన వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. కొడుకులు కార్తి, సూర్యలు ఇద్దరూ ఈ వేడుకలను దగ్గరుండి పర్యవేక్షించి, తమ తండ్రికి ఆనందం కలిగించారు. ఈ సందర్బంగా శివకుమార్ గీసిన కొన్ని డ్రాయింగ్స్ ని ప్రదర్శించారు. సూర్య, కార్తీ ఇద్దరూ ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ క్లోజింగ్ సమయంలో సూర్య మాట్లాడారు. అంతేకాకుండా తమ కుటుంబానికి చెందిన వెల్ విషర్స్ అంతా శివ కుమార్ గురించి మాట్లాడారు. అలాగే అదే సమయంలో శివకుమార్ రోజులునాటి సీనియర్ జర్నలిస్ట్ లను కూడా ఆహ్వానించి , వారి చేత మాట్లాడింప చేసారు. సీనియర్ జర్నలిస్ట్ మాటలతో షాక్ స్టేజిపై సీనియర్స్ ఒక్కొక్కరే వచ్చి మాట్లాడుతూ శివకుమార్ గొప్పతనాన్ని పొగుడుతున్నారు. అలాంటి వారిలో సీనియర్ జర్నలిస్ట్, సపోర్టింగ్ నటుడు బైలవన్ రంగనాధన్ కూడా మాట్లాడారు. శివకుమార్ తో తనకున్న ఎక్సపీరియన్స్ లు చెప్పుకొచ్చారు. కానీ అదే సమయంలో ఆయన చెప్పిన ఓ మాట అందరికీ షాక్ ఇచ్చింది.
ఆ సీనియర్ జర్నలిస్ట్ ఓ బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు అదే స్టేజిపై. తను తన కుమార్తె పెళ్లికి ఆహ్వానిద్దామని సూర్య ఆఫీసుకు వెళితే తనను చాలా దారుణంగా ట్రీట్ చేసారని చెప్పుకొచ్చారు. శివకుమార్ ఎప్పుడూ ఇలాంటి పనులు చెయ్యలేదన్నారు.
తమ తండ్రి నుంచి ఆ మంచి లక్షణాలను కొడుకులిద్దరూ నేర్చుకోవాలని ఆ సీనియర్ జర్నలిస్ట్ చురకలు అంటించారు. ఆఫీసుకు వచ్చినవారిని, ముఖ్యంగా సీనియర్స్ ని గౌరవించటం నేర్చుకోమని సూచించారు. శివకుమార్ ఎప్పుడూ అలాంటి పనులు ఎప్పుడూ చేయలేదని అని అన్నారు
వెంటనే సూర్య స్టేజిపైకి వచ్చి ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. అలాగే ఈ విషయం తనదాకా రాలేదని అన్నారు. తనది కొత్త ఆఫీస్ అని కొత్తవాళ్లకు ఉన్నారని, ఈ సారి ఎప్పుడూ అలాంటి పొరపాట్లు జరగవని ఆయన చెప్పుకొచ్చారు. తమ తండ్రి దారిలోనే తాము నడుస్తామని సింగం స్టార్ సూర్య చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment