Nestham Movie Creations

Saturday, 12 November 2016

థియేటర్లో ఒకే ఒక్కడు: రూ. 1000, రూ. 500 నోట్ల ఎఫెక్ట్


500, 1000 నోట్ల రద్దు: ‘బిచ్చగాడు' మూవీ డైలాగ్ దేశాన్ని ఊపేస్తోంది!హైదరాబాద్: రూ. 1000, రూ. 500 నోట్ల రద్దు ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై భారీగానే పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసినప్పటి నుండి థియేటర్లలో పెద్ద నోట్లను తీసుకోవడం లేదు. దీంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య భారీగా పడిపోయింది. అహ్మదాబాద్ లో ఓ థియేటర్లో..... ఒకే ఒక్క ప్రేక్షకుడితో షో నడిపంచాల్సి వచ్చింది. పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ ఏ రేంజిలో ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. చాలా చోట్ల ఏటీఎంలు కూడా పనిచేయక పోవడం, చేతిలో రోజువారి ఖర్చులకు కూడా డబ్బులు లేక పెద్దనోట్ల మార్పడి కోసం బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. సింగిల్ గా థియేటర్లో సినిమా చూసే అవకాశం దక్కించుకున్న ఆ యువకుడి పేరు హరి పంచల్. వయసు 21. గురువారం మధ్యాహ్నం స్థానిక మల్టీప్లెక్స్ థియేటర్‌కు 'మహాయోధ రామా' అనే యానిమేషన్ మూవీ చూసేందుకు వెళ్లాడు

No comments:

Post a Comment

About

Flickr