
హైదరాబాద్: అక్కినేని యంగ్ హీరో అఖిల్ త్వరలో పెళ్లికొడుకు కాబోతున్న సంగతి తెలిసిందే. తన ప్రియురాలు శ్రీయభూపాల్ ను అఖిల్ పెళ్లాడబోతున్నాడు. శ్రీయ భూపాల్ హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త షాలిని భూపాల్ కుమార్తె. ఈ షాలిని ఎవరో కాదు.. ప్రముఖ వ్యాపారవేత్త, జీవికె గ్రూప్ అధినేత జివి కృష్ణా రెడ్డి కుమార్తె. శ్రీయ భూపాల్ ఆయన మనవరాలు. ఇదంతా అందరికీ తెలిసిందే కదా.... అఖిల్ కు కాబోయే భార్యకు, నితిన్ లవ్ ఎఫైర్ కు లింకేటి అనుకుంటున్నారా? వస్తున్నాం.. వస్తున్నాం... ఆ మ్యాటర్లోకే వస్తున్నాం. అఖిల్, నితిన్ మంచి ఫ్రెండ్స్. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీయ భూపాల్ ను నితిన్ కు పరిచయం చేసాడట. తరచూ.... అఖిల్, శ్రీయ భూపాల్, నితిన్ పలు పార్టీల్లో కలిసే వారని, శ్రీయ భూపాల్ తో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఆ పార్టీలకు వచ్చేవారని...... శ్రీయ భూపాల్ ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయితో నితిన్ ప్రేమలో పడ్డాడని తెలుస్తోంది. VIDEO : Megastar film Khaidi No 150 song shoot in Europe Megastar film Khaidi No 150 song shoot in EuropeEntertainment Powered by నితిన్ ప్రపోజల్ ఆ అమ్మాయికి నితిన్ ఇటీవలే తన ప్రేమ విషయం ప్రపోజ్ చేసాడని, ఆ అమ్మాయి నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఎవరా అమ్మాయి? నితిన్ ప్రపోజ్ చేసిన అమ్మాయి శ్రీయ భూపాల్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తె అని ప్రచారం జరుగుతోంది. అయితే అమ్మాయి ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో.... ఇరు వర్గాల పెద్దల అంగీకారం తెలిపే వరకు ఆమె ఎవరనే విషయమై గోప్యత కొనసాగిస్తున్నారని టాక్. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ టాలీవుడ్ యంగ్ హీరోల్లోని మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్లలో నితిన్ ఒకరు. నితిన్ వయసు 33. హీరోయిన్లతో ఎఫైర్లు లేని నికార్సయిన స్టార్. వివాదాలకు కూడా వీలైనంత దూరంగా ఉండే బుద్దిమంతుడు. అరేంజ్డ్ మ్యారేజ్ వద్దని నితిన్ ఇప్పటి వరకు ఎవరితోనూ ప్రేమలో పడక పోవడంతో ఇంట్లో వారే అరేంజ్డ్ మ్యారేజ్ చేద్దామని పలు సంబంధాలు చూసారట. అయితే తనకు అరేంజ్డ్ మ్యారేజ్ ఇష్టం లేదని, ప్రేమ వివాహమే చేసుకుంటానని కొంతకాలంగా తనకు మనసుకు నచ్చే అమ్మాయి కోసం అన్వేషిస్తున్నాడు. అఖిల్ పుణ్యమా అని... అఖిల్ పరిచయం తర్వాత నితిన్ వ్యవహారం బాగా మారిపోయిందని, అప్పటి వరకు పార్టీలకు కాస్త దూరంగా ఉండే నితిన్ అతని పరిచయం తర్వాత తరచూ పార్టీలకు హాజరయ్యేవాడని, ఈ క్రమంలోనే శ్రీయ భూపాల్ ద్వారా ఆమె ఫ్రెండ్ పరిచయం అవ్వడం, ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం, ప్రేమలో పడిపోవడం జరిగిపోయిందని టాక్
No comments:
Post a Comment