Nestham Movie Creations

Friday, 11 November 2016

వర్మ 340 కోట్ల సినిమా.. రాజమౌళి ఎగ్జైట్మెంట్


వర్మ 340 కోట్ల సినిమా.. రాజమౌళి ఎగ్జైట్మెంట్వర్మ 340 కోట్ల సినిమా.. రాజమౌళి ఎగ్జైట్మెంట్ ఈ ఉదయం నుంచి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని ఒక వార్త షేక్ చేసేస్తోంది. 'న్యూక్లియర్' పేరుతో రామ్ గోపాల్ వర్మ రూ.340 కోట్ల భారీ బడ్జెట్తో ఓ మెగా మూవీ చేయబోతున్నాడన్నది ఆ వార్త సారాంశం. గత కొన్నేళ్లలో వర్మ ట్రాక్ రికార్డు చూసి ఈ వార్త వట్టి పుకారే అని చాలామంది సందేహించారు. కానీ ఈ ప్రాజెక్టు నిజంగానే తెరకెక్కబోతోందని.. 'సర్కార్-3' తర్వాత వర్మ సినిమా ఇదే అని కన్ఫమ్ అయింది. రామ్ గోపాల్ వర్మే కాక అమితాబ్ బచ్చన్ సైతం ఈ ప్రాజెక్టను కన్ఫమ్ చేశారు. నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమా వాస్తవమే అని పేర్కొంది. దీంతో ఈ ప్రాజెక్టు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. 'బాహుబలి' సినిమాతో ఇండియన్ సినిమా స్థాయినే మార్చేసిన రాజమౌళి సైతం వర్మ 'న్యూక్లియర్ సినిమా విషయంలో చాలా ఎగ్జైట్ అయిపోయాడు. ''వర్మ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్.. లిటరల్లీ'' అంటూ ఈ ప్రాజెక్టు గురించి తన ఎగ్జైట్మెంట్ ప్రకటించాడు. దీనిపై వర్మ స్పందిస్తూ.. ''రాజమౌళి సార్.. మీ బాహుబలి సినిమానే నాకు స్ఫూర్తి అని.. ఈ స్ఫూర్తితో ఏదో చేస్తానని మీకు ఒకసారి ఫోన్లో ప్రామిస్ చేశాను. కచ్చితంగా ఈ సినిమా కోసం చేయాల్సిందల్లా చేస్తా'' అని రిప్లై ఇచ్చాడు. ఇప్పటిదాకా ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ 'బాహుబలి'యే. శంకర్ 'రోబో-2' దాన్ని దాటే సినిమా అంటున్నారు. దాని బడ్జెట్ 300 కోట్లని.. 400 కోట్లని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే వర్మ చేయబోయేదే బిగ్గెస్ట్ మూవీగా భావించాలి.

1 comment:

About

Flickr