''నీచుడా..నన్ను వ్యభిచారిణిని చేశావ్'' 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య టెలివిజన్ ప్రపంచాన్ని షాక్లోకి నెట్టింది. ప్రియుడు రాహుల్రాజ్ సింగ్ వేధింపులు భరించలేకే ఆమె ఏప్రిల్లో గోరెగావ్లోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని వాదన. ఈ కేసులో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యూష చనిపోవడానికి ముందు రాహుల్కి ఫోన్ చేసి మూడు నిమిషాల పాటు మాట్లాడింది. వెలుగులోకి వచ్చిన ఆ సంభాషణ ఇప్పుడు సంచలనమైంది. ప్రేమ పేరుతో రాహుల్ ఆమెను ఎంతగా హింసించాడో ఆమె మాటలను బట్టి తెలుస్తోంది. చివరి నిమిషాల్లో ప్రత్యూష ఏడుస్తూ అతడితో మాట్లాడిన మాటలివే. 'నీచుడా, నా జీవితంలో అన్నింటికీ చాలా కష్టపడాల్సి వచ్చింది. నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నా కెరీర్ కోసం, నటించడానికి పరిశ్రమకు వచ్చాను. కానీ నువ్వు నన్ను వ్యభిచారిణిగా మార్చేశావ్. రాహుల్.. నువ్వు చేసిన పనికి నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. నువ్వు స్వార్థపరుడివి. నా పేరు చెడగొట్టావ్. నా గరించి, నా తల్లిదండ్రుల గురించి సమాజం తప్పుగా మాట్లాడుకుంటోంది. అంతా అయిపోయింది. నా పని అయిపోయింది.. నేనిక లేను'' అని ప్రత్యూష మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆవేదనతో ప్రత్యూష మాట్లాడిన తర్వాత ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దని అరగంటలో వస్తున్నానని రాహుల్ చెప్పినట్లు సమాచారం. అయితే రాహుల్ వచ్చేటప్పటికే ప్రత్యూష చనిపోయింది. ఫోన్ సంభాషణ ప్రకారం చూస్తే రాహుల్ ప్రత్యూషని వ్యభిచారంలోకి దించడానికి ప్రయత్నించాడని స్పష్టంగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆమె లాయర్ నీరజ్ గుప్తా హైలెట్ చేస్తున్నారు. ఈ కేసు విషయమై మళ్లీ విచారణ జరపాల్సిందిగా పిటిషన్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు కారణం ఆమె ప్రియుడు రాహులేనని ప్రత్యూష తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఆత్మహత్యకు పాల్పడేలా ఆమెను ప్రేరేపించాడన్న ఆరోపణలతో పోలీసులు రాహుల్ను అరెస్టు చేయగా ఆ తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. ప్రత్యూష తన కారణంగానే ప్రాణాలు తీసుకుందన్న ఆరోపణలను అతడు ఖండిస్తున్నాడు. ఆమెకు పని దొరకనప్పుడు తానే అండగా ఉన్నానని తెలిపాడు

No comments:
Post a Comment