
బాహుబలి-2లో కొత్త కుర్రాడు
‘బాహుబలి: ది కంక్లూజన్’లో బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు కనిపిస్తారని అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదని తర్వాత తేలింది. రెండో భాగంలో చెప్పుకోదగ్గ కొత్త పాత్రలు ఏమీ ఉండవని.. ఒకవేళ ఉన్నా వాటిలో పేరున్న కొత్త నటీనటులెవరూ నటించరని బాహుబలి యూనిట్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఐతే తాజాగా ఈ సినిమాలో స్వాతి నాయుడు అనే కొత్తమ్మాయి నటిస్తున్న సంగతి బయటికి వచ్చింది. ఆమెది చిన్న పాత్రే కానీ.. కీలకమైందే అని తెలిసింది. కాగా ఈ సినిమా ద్వారామరో కొత్త ముఖం ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఆ కొత్త ముఖం పేరు.. సిద్ధార్థ్ నాయుడు.
‘బాహుబలి’ సినిమాలో నటించాలని మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు ఈ సిద్ధార్థ్ నాయుడు. గతంలోనే ఈ కుర్రాడిని ‘బాహుబలి: ది బిగినింగ్’ కోసం పరిశీలించారట. అతడి ప్రొఫైల్ బాహుబలి మేకర్స్ దగ్గరికి చేరిందట. కానీ తొలి భాగంలో అవకాశం దక్కలేదు. ఐతే ఆ తర్వాత సిద్థార్థ్ మళ్లీ ప్రయత్నం చేయగా.. రెండో భాగంలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. బాహుబలి కోసం తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు సిద్ధార్థ్. తనది చిన్న పాత్రే అయినా.. ప్రాధాన్యం ఉన్నదే అని.. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనడం గొప్ప అనుభవమని సిద్ధార్థ్ చెప్పాడు. ప్రభాస్ తనను డార్లింగ్ డార్లింగ్ అంటూ ప్రేమగా పిలిచేవాడని అతను ఎగ్జైట్ అయ్యాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ‘రోగ్’ సినిమాలోనూ సిద్ధార్థ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమా.. బాహుబలి-2 విడుదలయ్యాక తనకు అవకాశాలు వరుస కడతాయని సిద్ధార్థ్ నాయుడు ఆశిస్తున్నా
No comments:
Post a Comment