
యువరాజ్ వెరైటీ పెళ్లి కార్డు చూశారా!
ఇండియన్ క్రికెట్లో సచిన్.. ద్రవిడ్.. గంగూలీ.. లాంటి దిగ్గజాల తర్వాత భారీగా అభిమాన గణం తర్వాతి తరం క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. తన స్టైలిష్ బ్యాటింగ్‌తో.. మెరుపు ఫీల్డింగ్‌తో.. పార్ట్ టైం బౌలింగ్‌తో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలందించాడు యువరాజ్. ఆటతో పాటు తన వ్యక్తిత్వంతోనూ యువరాజ్ కోట్లాది మంది మనసులు గెలిచాడు. క్యాన్సర్ పై పోరాడి గెలిచాక అతను మరింతగా అభిమానులకు చేరువయ్యాడు. ఇండియన్ స్టార్ క్రికెటర్లలో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోయిన అతి కొద్ది మందిలో యువరాజ్ ఒకడు. క్యాన్సర్ సోకని పక్షంలో ఈపాటికే ఓ ఇంటివాడైపోయి ఉండేవాడేమో.
ఐతే క్యాన్సర్ పై విజయం సాధించి.. మామూలు మనిషి అయ్యాక అతను హేజెల్ కీచ్ అనే విదేశీ భామతో ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. ముందు ఇది సరదా డేటింగ్ వ్యవహారం అనుకున్నారు కానీ.. ఇద్దరూ సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్న సంగతి తెలిసింది. యువరాజ్.. హేజెల్ ఈ నెల 30 పెళ్లి కూడా చేసుకోబోతుండటం విశేషం. ఛండీగఢ్లో వీళ్లిద్దరి పెళ్లి జరగబోతోంది. ఇందుకోసం యువరాజ్ తనదైన శైలిలో వెడ్డింగ్ కార్డులు కొట్టించాడు. యువరాజ్.. హేజెల్ ల క్యారికేచర్లతో.. క్రికెట్ పై యువరాజ్ ప్రేమను చాటేలా ఈ కార్డులు రూపొందించారు. హేజెల్ బ్యాట్ పట్టుకుని 'ఐ లవ్ క్రికెట్' అంటుంటే యువరాజ్ చాటు నుంచి చూడటం.. ఇద్దరూ క్రికెట్ పిచ్ మీద ప్రేమాయణం నడపడం.. అలాగే పిచ్ మీదే యువీ డోలు వాయిస్తుంటే.. హేజెల్ స్టెప్పులేస్తుండటం.. ఇలా వెడ్డింగ్ కార్డ్ థీమ్ అంతా క్రికెట్ తోనే ముడిపడి ఉంది. యువీ వెడ్డింగ్ కార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది
ni pelli card balega vundi
ReplyDelete