Nestham Movie Creations

Tuesday, 8 November 2016

ఆమె జీవితాన్ని అస్త‌వ్య‌స్తం చెయ్య‌కు..అఖిల్‌పై వ‌ర్మ బాంబు..!


రామ్‌గోపాల్ వ‌ర్మ ఏది చేసినా సంచ‌ల‌న‌మే. ఆయ‌న కామ్‌గా ఉన్నా అదో సెన్సేష‌న్‌. అలాంటి వ‌ర్మ‌.. రీసెంట్‌గా న్యూక్లియార్ అంటూ ఓ 350కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అణుబాంబు బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కునుంది ఈ ప్రాజెక్ట్‌. హాలీవుడ్ రేంజ్‌లో న్యూక్లియార్‌ని ప్లాన్ చేస్తున్నాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఈ చిత్రం త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. అయితే, వర్మ అఖిల్‌పై వేసిన ట్వీట్ అణుబాంబు కంటే బాగా పేలింది. అక్కినేని ఫ్యామిలీపై వ‌ర్మ ట్వీట్ చెయ్య‌డం చాలా త‌క్కువ‌. త‌నకు నాగార్జున శివ‌తో లైఫ్ ఇచ్చాడ‌న్న అభిప్రాయ‌మో, మెగా, నంద‌మూరి హీరోల కంటే వీరికి పాపులారిటీ త‌క్కువ.. మ‌న ట్వీట్స్‌ని ఎవ‌రు ఫాలో అవ్వ‌రన్న ఆలోచ‌నో కానీ… వారిపై సైలెంట్‌గా ఉంటాడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. అలాంటి ఈ డైరెక్ట‌ర్ తాజాగా అఖిల్‌కి మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అఖిల్ మ్యారేజ్‌పై వ‌ర్మ వేసిన ట్వీట్ బాగా పేలింది. బాబూ అఖిల్‌.. నేను నీలాగే మ్యారేజ్ విష‌యంలో తొంద‌ర‌ప‌డ్డాను… కెరీర్ ప్రారంభం కావ‌డానికే ముందే పెళ్లి చేసుకున్నాను.. నువ్వు కూడా నాలాగే చేస్తున్నావు అని ట్వీటాడు. ఇందులో ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ, ఆ త‌ర్వాతే అఖిల్‌పై అస‌లైన పంచ్ ప‌డింది. నువ్వు కూడా నాలాగే నీ కాబోయే భార్య జీవితాన్ని అస్త‌వ్యస్తం చెయ్య‌కు అంటూ ట్వీట్ వేశాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోయే అఖిల్‌కి ఈ ట్వీట్‌ని ఎలా తీసుకోవాలో అర్ధం కాక క‌న్‌ఫ్యూజ్ అవుతున్నాడట‌. పాజిటివ్‌గానా, నెగిటివ్‌గానా.. స‌ల‌హాగానా.. లేక సూచ‌న‌గానా..? ఎలా తీసుకోవాలో తెలియ‌క అఖిల్ డైల‌మాలో ప‌డ్డాడ‌ట‌.

No comments:

Post a Comment

About

Flickr