Nestham Movie Creations

Tuesday, 8 November 2016

పవన్ కల్యాణ్, మహేష్ బాబు సీక్రెట్ ఎగ్రిమెంట్…

Untitled-4

ఈ ఇద్దరు స్నేహితులు మొన్నటివరకు చాలా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు సెడన్ గా వయొలెంట్ అయిపోయారు. అదేదో తెరవెనక సీక్రెట్ ఎగ్రిమెంట్ కుదిరినట్టు తెగ రెచ్చిపోతున్నారు. అవును.. మొన్నటివరకు ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టే ఈ హీరోలు.. ఇప్పుడు కూడబలుక్కొని మరీ ఫైర్ అవుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు తాజాగా 3 సినిమాల కన్ ఫం చేస్తే… పవన్ కూడా ముచ్చటగా మూడో సినిమాకు కొబ్బరికాయ కొట్టేశాడు. ఇలా ఇద్దరు మిత్రలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కాటమరాయుడు అనే సినిమా చేస్తున్నాడు పవన్. ఈ సినిమా సెట్స్ పై ఉంటుండగానే నేసన్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఏఎం రత్నం సమర్పణలో ఆ సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టాడు. ఇదే గొప్ప విషయం అనుకుంటే… తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో సినిమా కూడా లాంచ్ చేసాడు. అంటే ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయన్నమాట. అది కూడా అఫీషియల్ గా. ఇక మహేష్ విషయానికొద్దాం. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మరో సినిమా చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మహేష్ మాత్రం రేపే కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టబోతున్నాడు. మరోవైపు పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా కూడా ఓకే చేశాడు. ఇలా మహేష్-పవన్ ఇద్దరూ ఓ రేంజ్ లో చెలరేగిపోతున్నారు.

No comments:

Post a Comment

About

Flickr