Nestham Movie Creations

Tuesday, 8 November 2016

భర్త కోసం....


aishwarya   పునరాగమనం తర్వాత అభినయానికి ఆస్కారమున్న పాత్రలకు ప్రాధాన్యమిస్తోన్న ఐశ్వర్యరాయ్ ఇటీవలే విడుదలైన యే దిల్ హై ముష్కిల్‌లో అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ సినిమాతో మళ్లీ గ్లామర్ బాట పట్టిన ఆమె తాజాగా భర్త అభిషేక్ బచ్చన్ కోసం ైస్టెలిస్ట్‌గా అవతారమెత్తింది. ఇటీవలే ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్‌షోకు హాజరైన అభిషేక్‌బచ్చన్ వినూత్న లుక్‌తో ఆహుతుల్ని అలరించారు. గులాబీ వర్ణ వస్త్రధారణతో వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తన ఫ్యాషన్స్‌కు సంబంధించిన క్రెడిట్ అంతా భార్య ఐశ్వర్యరాయ్‌కే దక్కుతుందని ఈ సందర్భంగా అభిషేక్ తెలిపారు. ట్రెండ్స్‌కు తగినట్లుగా వస్తోన్న మార్పులు, నూతన శైలులకు సంబంధించి ఐశ్వర్యతో పాటు కూతురు ఆరాధ్య నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తానని ఆయన చెప్పారు. ఫ్యాషన్స్ విషయంలో ఐశ్వర్య అభిరుచులు ఆమోఘమని భార్యకు కితాబిచ్చారు. యే దిల్ హై ముష్కిల్ సినిమా చూడటం కుదరలేదని, త్వరలోనే సినిమా తిలకిస్తానని ఆయన చెప్పారు

No comments:

Post a Comment

About

Flickr