Nestham Movie Creations

Saturday, 12 November 2016

మళ్లీ పెళ్లి అంటున్న కొయిరాలా


మళ్లీ పెళ్లి అంటున్న కొయిరాలామనీషా కొయిరాలా.. అంత సులువుగా మరిచిపోయే పేరు కాదిది. ‘క్రిమినల్’ సినిమా ఫ్లాపైనా ఆమె అందం వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఆ తర్వాత ‘భారతీయుడు’, ‘ఒకే ఒక్కడు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి మరింతగా చొచ్చుకుపోయింది ఈ నేపాల్ బ్యూటీ. సినీ కెరీర్ ముగిసిపోయాక తన దేశానికే చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకున్న కొయిరాలా.. రెండు మూడేళ్ల పాటు ఎక్కడా కనిపించలేదు. దీంతో పర్సనల్‌ లైఫ్‌లో బాగానే సెటిలైపోయిందని అనుకున్నారు. కానీ తన భర్తతో పడక ఉన్నట్లుండి డైవర్స్ తీసుకుని అందరికీ షాకిచ్చింది కొయిరాలా. ఈ మధ్యే సినిమాల్లోకి పునరాగమనం కూడా చేసింది. ఆల్రెడీ ఓ తమిళ సినిమాలో తళుక్కుమంది. ప్రస్తుతం బాలీవుడ్లో ‘డియర్ మాయా’తో పాటు ఇంకో సినిమా కూడా చేస్తోంది. ఐతే పర్సనల్‌ లైఫ్‌లో కొయిరాలా ఒంటరిగా ఉండబోదట. ఆమెకు మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉందట. ఆ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మనీషానే వెల్లడించింది. వచ్చే ఏడాది తాను ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలనుకుంటున్నానని చెప్పిన కొయిరాలా.. తన కుటుంబ సభ్యులు నేపాల్‌లో ఉండటంతో తాను ముంబయిలో ఒంటరిగా ఫీలవుతున్నానని తెలిపింది. ముందు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నాక.. తన మనసుకు నచ్చిన, తనను అర్థం చేసుకునే వ్యక్తి తారసపడితే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అలాంటి వ్యక్తి కోసమే వెతుకుతున్నానని.. ఐతే ఆ లోపే ఓ చిన్నారిని దత్తత తీసుకుంటానని చెప్పింది

No comments:

Post a Comment

About

Flickr