గతంలో హార్రర్ సినిమా అంటే.. హార్రర్ సినిమానే. కామెడీ పేరు చెప్పి కలగాపులగం చేయడం ఉండేది కాదు. భయపెట్టడమే హార్రర్ సినిమాల లక్ష్యంగా ఉండేది. దీనికంటూ ఓ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉండేది. ఆ తరహా ప్రేక్షకులు గత కొన్నేళ్లలో హార్రర్ కామెడీల దెబ్బకు థియేటర్ల వైపు వెళ్లడమే మానేశారు. అలాంటి ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు రప్పించి.. వాళ్లను ఉక్కిరి బిక్కిరి చేసింది మాయ (తెలుగులో మయూరి) సినిమా. నయనతార లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఇండియాలో వచ్చిన బెస్ట్ హార్రర్ థ్రిల్లర్స్‌లో ఒకటిగా నిలిచింది. అందులో నయన్ అభినయం కూడా అదిరిపోవడంతో ఆమెతో మరిన్ని హార్రర్ సినిమాలు చేయించడానికి దర్శక నిర్మాతలు తన వెంట పడుతున్నారు. ఐతే ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న నయన్.. తన వద్దకు వచ్చిన హార్రర్ ప్రాజెక్టుల్లో రెంటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఒకటి కార్తి హీరోగా నటిస్తున్న 'కాష్మోరా'. ఇంకోటి లేడీ ఓరియెంటెడ్ సినిమా 'డోర'. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఒకేసారి రిలీజ్ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చేసింది. తెలుగులో మాల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. దాస్ రామస్వామి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. 'మయూరి' తరహాలోనే ఇది కూడా హార్రర్ థ్రిల్లర్ అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ బాగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. నవంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. -

No comments:
Post a Comment