Nestham Movie Creations

Saturday, 12 November 2016

ముద్దులో ఇన్ని రకాలున్నాయా రాజా..?

ముద్దులో ఇన్ని రకాలున్నాయా రాజా..?
సినిమాలో ముద్దులుండటం కామన్‌.. కానీ ముద్దుల కోసమే సినిమా చేస్తే.. అది ఎలా ఉంటుందో తెలుసా..? అచ్చంగా మరో మాట లేకుండా బేఫికర్‌ అనే సినిమా మాదిరే ఉంటుంది. బాలీవుడ్‌ లో ఇప్పుడు మూతి ముద్దులు అనేవి ఎంత కామన్‌ అయిపోయావో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లవ్‌ సీన్‌ ఎక్స్‌ ప్రెస్‌ చేయడానికి ఒకప్పుడు హీరో హీరోయిన్లు తెగ నటించేవాళ్లు.. దర్శకులు ఆ ఎక్స్‌ ప్రెషన్‌ చూపించడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఇవేవీ అక్కర్లేదు. సింపుల్‌ పెదాలు పెదాలు కలిపేస్తున్నారు. ఆ ముద్దు ఎంత ఘాటుగా ఉంటే.. వాళ్ల ప్రేమ కూడా అంతే ఘాటుగా ఉన్నట్లు లెక్క. అందుకే హీరో హీరోయిన్లు కూడా ముద్దు సీన్లను పరమ లైట్‌ తీసుకుంటున్నారు. బాలీవుడ్‌ లో ఇప్పుడు బేఫికర్‌ అనే సినిమా ఒకటి వస్తుంది. దిల్‌ వాలే దుల్హనియా, మొహబ్బతేన్‌, రబ్‌ నే బనాది జోడీ లాంటి హిట్‌ సినిమాలు చేసిన ఆదిత్య చోప్రా ఈ చిత్రానికి దర్శకుడు. రణ్‌ వీర్‌ సింగ్‌, వీణాకపూర్‌ ఇందులో జంటగా నటిస్తున్నారు. క్యూట్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న బేఫికర్‌ లో బేఫికర్‌ గా రెచ్చిపోయారు హీరో హీరోయిన్లు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఆరు పోస్టర్లు విడుదలయ్యాయి. అన్నింట్లోనూ కనిపించింది లిప్‌ లాక్‌ సీన్లే. తాజాగా విడుదలైన వీడియో సాంగ్‌ లో అయితే రొమాన్స్‌ పీక్స్‌ కు వెళ్లిపోయింది. ముద్దులో ఎన్ని రకాలుంటాయో.. అన్నింటినీ ఈ పాటలో చూపించేసాడు దర్శకుడు. ఇప్పటి వరకు ఏ బాలీవుడ్‌ సినిమాలో లేని విధంగా ఏకంగా 24 ముద్దు సీన్లు ఉండబోతున్నాయట. ప్రేమ కావాలన్న ప్రతీసారి బండిలో పెట్రోల్‌ పోసినట్లు.. హీరోయిన్‌ హీరోకు ముద్దుచ్చేస్తుందేమో మరి..! ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ పూర్తైపోయింది. డిసెంబర్‌ 9, 2016న విడుదల కానుంది ఈ సినిమా. మరి రేపు సినిమా విడుదలైన తర్వాత ముద్దు ముచ్చట్లు ఎలా ఉండబోతున్నాయో..

No comments:

Post a Comment

About

Flickr