ఇలియానా మంచి అందగత్తే. కానీ ఆమెకు ప్రధానంగా ఒక లోటుంది. అదేంటని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదొక్కటి ఉంటే ఇల్లీ బేబీ ఎక్కడికో వెళ్లిపోయేదని అంటుంటారు అభిమానులు. ఐతే ఈ విషయం మాట్లాడ్డానికి మనం మొహమాటపడ్డా.. ఇల్లీ మాత్రం అలా ఇబ్బంది పడలేదు. తనకున్న లోటు గురించి ఆమె ఓపెన్‌గా మాట్లాడేసింది. తనకు ఎద సౌందర్యం తక్కువని.. ఈ విషయంలో చాలామంది చాలా కామెంట్లు చేశారని.. దీనిపై తాను ఇంట్లో కూర్చుని ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని ఇలియానా చెప్పడం విశేషం. ‘‘నేను సినిమాలు చేయకుండా ఖాళీగా ఉన్న సమయంలో నాపై వచ్చిన కామెంట్లతో చాలా బాధపడ్డాను. ఇంట్లో ఒంటరిగా కూర్చుని బోరున ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నా ఫిజిక్ గురించి చేసిన కామెంట్లు నన్ను చాలా బాధపెట్టాయి. నా బ్రెస్ట్స్ గురించి కొందరు నన్ను అవమానించే రీతిలో కామెంట్లు చేశారు. అవి వింటే ఏడుపొచ్చేసేంది. ఐతే రాను రాను ఇలాంటి కామెంట్లు పట్టించుకోవడం మానేశా. ఆ మాటలే నేను రాటుదేలేలా చేశాయి. కాబట్టి ఇప్పుడు ఎవరేమన్నా.. ఎలాంటి కామెంట్లు చేసినా పట్టించుకోవట్లేదు’’ అని ఇలియానా చెప్పింది. ‘హ్యాపీ ఎండింగ్’ ఫ్లాప్ తర్వాత ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉండిపోయిన ఇల్లీ.. ఇటీవలే ‘రుస్తుమ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టి.. రెండు కొత్త సినిమాల్లో అవకాశాలు పట్టేసింది.

No comments:
Post a Comment