కాజలేంటి.. నిజస్వరూపం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఈ భామ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. మహా అయితే మరో రెండు మూడేళ్ల కంటే ఎక్కువ ఇండస్ట్రీలో ఉండలేమని కాజల్ కు కూడా తెలిసిపోయింది. అందుకే రెమ్యునరేషన్ దగ్గర అస్సలు తగ్గట్లేదు కాజల్. కాస్త ఎక్కువిస్తామంటే క్రేజ్ ను కూడా పక్కనబెట్టి తనకంటే చిన్న రేంజ్ హీరోలతోనూ ఆడిపాడేస్తోంది చందమామ. కాజల్ మరీ అంత డబ్బు మనిషా..? ఆమెకు సెంటిమెంట్లు లేవా..? ఇండస్ట్రీలో ఎవరైనా గుర్తింపు కోసం వస్తారు.. అది వస్తే డబ్బు ఎలాగూ వస్తుంది కాబట్టి ఎవరైనా మాకు పేరు ముఖ్యం అంటారు. కానీ కాజల్ మాత్రం భిన్నం. తనకు డబ్బే ముఖ్యమని తేల్చి చెబుతోంది. అసలు డబ్బు లేకపోతే ఈ పేరు ఎందుకు అంటూ రివర్స్ సెటైర్లు వేస్తోంది. ఇండస్ట్రీకి వచ్చిందే డబ్బు సంపాదించుకోడానికి.. అలా కాకుండా పేరు కోసం వచ్చామని చెబితే పచ్చి అబద్ధమే అంటోంది ఈ బ్యూటీ. కాజల్ పక్కా మనీమైండెడ్ అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ తనెంత కమర్షియల్ అంటే పారితోషికం సరిపోకపోతే ఏ హీరోను కూడా చూడదు డేట్స్ ఇవ్వను పో అంటోంది. పవన్, కమల్, మహేశ్ లాంటి సూపర్ స్టార్స్ తో నటించే ఛాన్స్ ను కేవలం పారితోషికం సరిపోలేదని పక్కనబడేసింది కాజల్. కెరీర్ లో సినిమాల్లేకుండా ఖాళీగా అయినా ఉంది గానీ తన రేంజ్ ను మాత్రం తగ్గించుకోలేదు కాజల్. అంతెందుకు.. బ్రహ్మోత్సవంలోనూ కేవలం ఎక్కువ పారితోషికం ఇస్తున్నారని అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేని పాత్రలో నటించింది చందమామ. కాజల్ ప్రస్తుతం చిరంజీవి ఖైదీ నెంబర్ 150.. తమిళ్ లో జీవాతో కాదలమ్ వెండై సినిమాల్లో నటిస్తోంది. కాజల్ ఇమేజ్ తో పోలిస్తే జీవా చాలా తక్కువ. కానీ ఈ సినిమాలో అమ్మడు అందాలను భారీగా ఆరబోసింది. దీనికి కారణం పారితోషికం. భారీ రెమ్యునరేషన్ కు బదులుగా భారీ గ్లామర్ షో ను గిఫ్ట్ గా ఇచ్చింది కాజల్. ఇక చిరుతో నటించడానికి కూడా బాగానే వెనకేసుకుంది చందమామ. ఇప్పటి వరకు ఐటం సాంగ్స్ చేయని కాజల్.. జనతా గ్యారేజ్ లో ఒక్క పాట కోసం 50 లక్షలకు పైగా తీసుకుందని సమాచారం. మొత్తానికి డబ్బో రక్షతి రక్షితః అంటోంది కాజల్

No comments:
Post a Comment