Nestham Movie Creations

Saturday, 12 November 2016

సచిన్-చాముండి.. అసలేంటి వీళ్ల బంధం?


సచిన్-చాముండి.. అసలేంటి వీళ్ల బంధం?సచిన్ ఎంత పెద్ద సెలబ్రెటీనో.. ఎంత గొప్ప క్రికెటరో.. ఎంత గొప్ప వ్యక్తో.. కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా అందుకున్నాడతను. అలాంటి వాడు తరచుగా మన చాముండీశ్వరీనాథ్‌తో కనిపించడం.. అతడితో అత్యంత ఆత్మీయంగా మెలగడం.. ఫారిన్ టూర్లకు వెళ్లినా అతణ్ని వెంట తీసుకెళ్లడం.. అత్యంత ముఖ్యమైన సందర్భాల్లో సచిన్ తన పక్కన చాముండికి చోటివ్వడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇటీవల రియో ఒలింపిక్స్‌కు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన సచిన్.. రియోకు వెళ్తే వెంట చాముండి ఉన్నాడు. తాజాగా ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన సింధు, సాక్షి మాలిక్‌లతో పాటు గోపీచంద్, దీపా కర్మాకర్‌లకు బీఎండబ్ల్యూ కార్లు బహుమతిగా ప్రకటించాడు చాముండి. రాజ్యసభకు వెళ్లడానికి కూడా టైం లేనంత బిజీగా ఉండే సచిన్.. ఈ కార్యక్రమం కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. తన చేతుల మీదుగా వారికి కార్లు అందించాడు. మరి చాముండితో సచిన్‌కు ఇంత ఆత్మీయత ఎక్కడి నుంచి వచ్చిందనే సందేహం రాకమానదు. ఐతే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. సచిన్‌‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీల్ని చాలా వరకు చాముండినే చూస్తాడు. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు సహా చాలా ప్రాంతాల్లో సచిన్ పేరిట పెట్టుబడులు పెట్టింది.. వాటిని మేనేజ్ చేసేది చాముండినే. సచిన్ గురించి సమస్తం తెలిసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో చాముండి ఒకడంటారు. సచిన్ తన కుటుంబ సభ్యులకు కూడా తెలియని విషయాలు చాముండికి తెలుసు అని కూడా చెప్పుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో కూడా సచిన్‌కు చాముండి నుంచి అండ లభిస్తుందని సమాచారం. చాలా విషయాల్లో సచిన్.. చాముండి మీద ఆధారపడతాడట. అందుకే చాముండికి అంత ప్రయారిటీ ఇస్తాడు సచిన్. ఆ మధ్య చాముండి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం గుర్తుండే ఉంటుంది. ఆ కొన్ని రోజులు మాత్రం చాముండికి కొంచెం దూరంగా మెలిగాడు సచిన్. ఆ తర్వాత షరామామూలే. వివాదాస్పద నేపథ్యం.. ఆరోపణలు ఉన్న చాముండితో భారతరత్న పురస్కారం అందుకున్న గొప్ప వ్యక్తి కలిసి తిరగడమేంటి.. అతడికి అంత ప్రయారిటీ అని ఎవ్వరూ అడగరు. అసలు ఒలింపిక్స్ లో పతకాలు గెలిచిన వాళ్లకు బీఎండబ్ల్యూ కార్లు బహుకరించేంత సీన్ చాముండికి ఎలా వచ్చిందనేది కూడా ఇక్కడ సందేహాలు రేకెత్తించే విషయం. కానీ దీని గురించి ఎవరూ చర్చించరు. ఎంతైనా పెద్దోళ్ల వ్యవహారం కదా.. అలాంటి విషయాలు మీడియాలో హైలైట్ అవ్వవంతే

No comments:

Post a Comment

About

Flickr