Nestham Movie Creations

Saturday, 12 November 2016

కూతురు.. కులం గురించి ప‌వ‌న్‌


కూతురు.. కులం గురించి ప‌వ‌న్‌ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి స‌భ సంచ‌ల‌నాల‌కు వేదికైంది. చాలా విష‌యాల‌పై ప‌వ‌న్ ఓపెన్ అయిపోయాడు. ప్ర‌త్యేక హోదాపై పోరాటం ప్ర‌క‌టించాడు. కేంద్ర‌.. రాష్ట్ర ప్ర‌భుత్వాల మీద విమ‌ర్శ‌ల‌కు వెనుకాడ‌లేదు. రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌తో పాటు ప‌వ‌న్ కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాల మీదా స్పందించి ఆస‌క్తి రేకెత్తించాడు. ముఖ్యంగా త‌న కూతురి గురించి మాట్లాడిన‌పుడు.. సినిమాల గురించి స్పందించిన‌పుడు అంద‌రూ ఆస‌క్తిగా విన్నారు. త‌న‌మీద కులం ముద్ర వేయ‌డం.. విమ‌ర్శ‌లు చేయ‌డంపై స్పందిస్తూ ప‌వ‌న్ త‌న కూతురి ప్ర‌స్తావ‌న తెచ్చాడు. ‘‘నాపై కులం ముద్ర వేయొద్దు. నా కూతురు క్రిస్టియన్. రష్యన్ అయిన నా భార్య నా కూతుర్ని క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారమే పెంచుతానంటే స‌రే అన్నాను. జీసస్‌ను పూజిస్తామన్నా నాకు అభ్యంతరం లేదు. ఎన్నిరూపాల్లో ఉన్నా నాకు దేవుడు ఒక్కడే. నాకు కులం, మతం, ప్రాంతం అంటగట్టవద్దు. నా కులం, మతం, ప్రాంతం మానవత్వమే. నాకు కులమతాలు అంటగడితే కోపం నషాళానికి అంటుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి నా దృష్టికి వచ్చిన లోపాలను ఎత్తిచూపినప్పుడు నాకు కులాన్ని ఆపాదించేందుకు కొందరు ప్రయత్నించారు. ఇది దుర‌దృష్ట‌క‌రం’’ అని ప‌వ‌న్ అన్నాడు. ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా ద్వారా త‌న‌కు డ‌బ్బులు రాలేద‌ని.. జ‌నాలు టికెట్లు కొన‌క‌పోతే ఎలా డ‌బ్బులొస్తాయ‌ని అంటూ.. ‘‘ఈసారి కొంచెం గ‌ట్టిగా చూడండ‌బ్బా’’ అంటూ ప‌వ‌న్ చ‌మ‌త్క‌రించ‌డం విశేషం

No comments:

Post a Comment

About

Flickr