Nestham Movie Creations

Saturday, 12 November 2016

భలే భలే మగాడివోయ్.. కొత్త వెర్షన్ వచ్చింది

భలే భలే మగాడివోయ్.. కొత్త వెర్షన్ వచ్చింది
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ‘భలే భలే మగాడివోయ్’. నాని ఈ సినిమాతోనే స్టార్ ఇమేజ్ సంపాదించాడు. మారుతి కూడా ఈ సినిమాతోనే వెంకీ లాంటి పెద్ద హీరోతో పని చేసే అవకాశం సంపాదించాడు. పెద్ద సినిమాల స్థాయిలో థియేటర్లలో ఇరగాడేసిన ‘భలే భలే మగాడివోయ్’.. ఆ తర్వాత టీవీల్లో కూడా అదరగొట్టింది. విశేషం ఏంటంటే.. తెలుగులో రిలీజైన ఏడాదికి ఈ చిత్రం కన్నడలోనూ రిలీజవుతోంది. కన్నడలో ‘సుందరాంగ జాణ’ పేరుతో ఈ చిత్రం రీమేక్ అయింది. అక్కడ గోల్డెన్ స్టార్‌గా పేరొందిన గణేష్.. నాని పాత్రలో కనిపిస్తున్నాడు. అక్కడ కూడా హీరో పాత్ర పేరు లక్కీనే కావడం విశేషం. ఈ చిత్రానికి దర్శకుడు మరెవరో కాదు.. రమేష్ అరవింద్. ‘సతీ లీలావతి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న రమేష్ అరవింద్ ఆ తర్వాత తర్వాత దర్శకుడిగా మారి కన్నడలో కొన్ని సినిమాలు తీశాడు. కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’కు కూడా ఆయనే దర్శకుడు. ఇప్పుడు ‘భలే భలే మగాడివోయ్’ రీమేక్‌తో ప్రేక్షకుల్ని పలకరిస్తున్నాడు. ‘లవ్లీ’, ‘రౌడీ’ లాంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్న శాన్వి ఇందులో కథానాయికగా నటిస్తోంది. హీరోయిన్ తండ్రిగా మురళీ శర్మ పాత్రలో దేవరాజ్ నటిస్తున్నాడు. ట్రైలర్ చూస్తుంటే ‘భలే భలే మగాడివోయ్’ను దాదాపుగా దించేసినట్లున్నారు. ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్‌తో కలిసి అల్లు అరవిందే నిర్మించడం విశేషం

No comments:

Post a Comment

About

Flickr