అనుకోకుండా హీరో అవతారం ఎత్తి సూపర్ సక్సెస్ అయిపోయాడు రాజ్ తరుణ్. అతను ఐదు సినిమాల్లో హీరోగా చేస్తే.. అందులో నాలుగు హిట్లు. ఐతే రాజ్ హీరో అవుదామని ఇండస్ట్రీకి రాలేదు. ముందు అతను దర్శకత్వ శాఖలోకి ప్రవేశించాడు. ఆ సినిమానే 'ఉయ్యాల జంపాల'. కానీ ఆ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనుల్లో ఉండగానే అనుకోకుండా అదే సినిమాలో హీరో పాత్రకు సెలక్టయిపోయాడు. ఐతే డైరెక్టర్ విరించి వర్మకు మాత్రం రాజ్ తరుణ్‌ను హీరోగా తీసుకోవడం ఇష్టం లేదట. అతను ఆ పాత్రకు సరిపోడేమో అని సందేహించాడట. మరి అతను రాజ్‌ను ఓకే చేయడానికి ముందు ఏం జరిగిందో విరించి మాటల్లోనే తెలుసుకుందాం పదండి. ''ఉయ్యాల జంపాల సినిమా నటీనటుల కోసం ఆడిషన్స్ చేస్తున్న టైంలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రాజ్ తరుణ్ మీద నిర్మాత రామ్మోహన్ ఆసక్తి చూపించారు. అతణ్నే హీరోగా పెడదామన్నారు. ఐతే బాగా చిన్నవాడిలా కనిపిస్తున్నాడని అభ్యంతరం వ్యక్తం చేశాను. దీంతో ఈ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ గీత గారు తరుణ్‌కు రెండు నెలల పాటు ఆక్యుపంక్చర్ చేయించారు. దాంతో రెండేళ్లు వయసు పెరిగినట్లు కనిపించాడు. దీనికి తోడు సినిమా షూటింగ్ మొదలవడానికి సమయం పట్టింది. ఈ లోపు ఇంకొంచెం ఒళ్లు చేశాడు. వయసు పెరిగినట్లు కనిపించాడు. దీంతో అతను హీరో పాత్రకు సరిగ్గా సరిపోయాడు. హీరోయిన్ కోసం మూడు నెలలు ఇంటర్నెట్లో వెతికాం. అవికా గోర్ చేసిన సీరియల్ నేను చూడలేదు. ఐతే యూట్యూబ్‌లో ఆమె వీడియో ఒకటి చూశాక ఆడిషన్స్ చేసి ఓకే చేశాం. అలా 'ఉయ్యాల జంపాల'కు హీరో హీరోయిన్లు కుదిరారు'' అని విరించి వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు

No comments:
Post a Comment