Nestham Movie Creations

Saturday, 12 November 2016

వేరు కాపురం అనే భార్యలకు షాకింగ్ న్యూస్


వేరు కాపురం అనే భార్యలకు షాకింగ్ న్యూస్దేశ అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర తీర్పును ఇచ్చింది. తాజాగా వెలువరించిన ఈ తీర్పు ‘భార్యల’కు షాకింగ్ గా మారుతుందని చెప్పొచ్చు. పెళ్లి అయిన తర్వాత భర్తతో కలిసి విడిగా కాపురం పెట్టాలని భావించే ఎంతో మహిళలకు సుప్రీం తాజా నిర్ణయం ఒక పట్టాన మింగుడుపడదంటే అతిశయోక్తి కాదేమో. పెళ్లి తర్వాత.. భర్తను వారి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంచేలా.. వేరుకాపురం పెట్టాలన్న ఒత్తిడిని చాలామంది భార్యల నోటి నుంచి రావటం కనిపిస్తుంది. అలాంటి వారికి షాకిచ్చేలా సుప్రీం తాజాగా తీర్పు ఇచ్చింది. వివాహం అయ్యాక.. భర్త కావాలని కానీ.. వారికి అప్పటివరకూ అన్ని తామైన తల్లిదండ్రులు వద్దంటే వద్దని చెప్పే భార్యలు చాలామందే మన చుట్టూ కనిపిస్తుంటారు. ఇకపై.. ఇలాంటి మాటలు కానీ చెబితే.. వారికి విడాకులు ఇచ్చేయొచ్చంటూ సుప్రీం తీర్పు ఇచ్చింది. కాకుంటే.. ఈ తీర్పు కేవలం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పెళ్లి తర్వాత భర్తతో మాత్రమే కలిసి ఉండాలని.. అతడి సంపాదన తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో అతడిని తల్లిదండ్రులకు దూరం చేయకూడదంటూ.. జస్టిస్ అనిల్ ఆర్. దవే.. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పును ఇచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన భారతీయ సంప్రదాయానికి విరుద్దమన్న కోర్టు.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి వేరు కాపురం పెట్టాలని భార్య అనుకోవటం చాలా తప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్ద చేసి చదివించినప్పుడు.. పెళ్లి తర్వాత కన్నవారిని పోషించటం వారి బాధ్యతని పేర్కొంది. ఒకవేళ తమ వద్ద సంపాదన అంతంత మాత్రంగా ఉన్నా తల్లిదండ్రుల్ని విడిచిపెట్టకూడదని.. తల్లిదండ్రుల్ని చూసుకోవటం కొడుకుల బాధ్యతగా పేర్కొంది. ఈ తీర్పు చాలానే ప్రభావం చూపించే అవకాశం ఉందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment

About

Flickr