
నిత్యామీనన్‌ను చూస్తే రెగ్యులర్ హీరోయిన్ ఫీచర్లు అస్సలు కనిపించవు. హైట్ తక్కువ.. పైగా లావుగా ఉంటుంది. గ్లామర్ కోణం తక్కువే. అయినా తన యాక్టింగ్ టాలెంట్‌తో బాగానే నెట్టుకొచ్చేస్తోంది ఈ మలయాళ కుట్టి. హైట్ విషయంలో చేసేదేమి లేదు కానీ.. కనీసం స్లిమ్‌గా ఉండేందుకు ట్రై చేయొచ్చు కదా అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. తనకు వచ్చే పాత్రలు నటనను చూసి రావాలి కానీ.. ఫిజిక్ చూసి కాదని తనదైన శైలిలో బదులిచ్చింది నిత్య. తనకు నచ్చింది తింటానని.. ఫుడ్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెద్దగా పెట్టుకోనని కూడా ఆమె కుండబద్దలు కొట్టింది ఓసారి. అలా అన్న నిత్య.. ఇప్పుడు మాత్రందానికి భిన్నంగా చేస్తోంది.
విక్టరీ వెంకటేష్ సరసన ఆమె ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహించనున్న సినిమా ఇది. ఈ చిత్రం కోసం నిత్య తన లుక్ మార్చుకుంటోందట. పాత్రకు తగ్గట్లుగా కొంచెం సన్నగా కనిపించాల్సిందే అని దర్శకుడు తేల్చి చెప్పడంతో ఆమె బరువు తగ్గే పనిలో పడిందట. ఇందుకోసం ఫుడ్ తగ్గించి.. కచ్చితమైన డైట్ పాటిస్తోందట. ఈ సినిమాలో నిత్య లుక్ చూసి షాకవ్వాల్సిందేనట. బహుశా పాత్ర డిమాండ్ చేసేసరికి నిత్య తనను తాను మార్చుకోవడానికి రెడీ అయిందేమో. విశేషం ఏంటంటే.. కెరీర్ ఆరంభంలో వెంకీ లాంటి పెద్ద వయస్కుడితో తాను నటించనంటూ స్టేట్మెంట్ ఇచ్చిన నిత్య.. ఇప్పుడు తనకు కాస్త వయసు పెరిగే సరికి అభిప్రాయం మార్చుకుంది. అదే పెద్ద వయస్కుడితో నటించడానికి
No comments:
Post a Comment