Nestham Movie Creations

Saturday, 12 November 2016

'మా గాళ్ ఫ్రెండ్స్ మాకే'

'మా గాళ్ ఫ్రెండ్స్ మాకే'
తన కుమార్తె గురించి మీడియాలో వస్తున్న వార్తలపై అమితాబ్ బచ్చన్ తనయ శ్వేతా నంద ఇటీవలే బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కారు. టీనేజర్ అయిన నవ్యను వదిలేయాలంటూ విజ్ఞప్తి చేశారు. తాజాగా ఈ లిస్ట్‌లో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కూడా చేరాడు. కుమారుడు ఆర్యన్ ఖాన్ గాళ్ ఫ్రెండ్స్ వివరాలు చెప్పమంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు 'చెప్పను' అనే అర్ధం స్ఫురించేలా తనదైన శైలిలో స్పందించాడు. వివరాల్లోకి వెళ్తే.. 'ద రింగ్' షూటింగ్ నిమిత్తం షారుక్ హంగేరీలో ఉన్నాడు. కాస్త తీరిక చేసుకుని 15 నిమిషాల పాటూ అభిమానులకు అందుబాటులో ఉండాలని ట్విట్టర్ ఓపెన్ చేశాడు. ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్‌ కు చతురోక్తులు కూడా కలిపి ఓపిగ్గా సమాధానాలిచ్చాడు. ఇక ఆర్యన్ గాళ్ ఫ్రెండ్స్ గురించి మీకు తెలుసా? అంటూ మధ్యలో ఓ అభిమాని ప్రశ్న సంధించాడు. దీనికి స్పోర్టివ్‌ గా స్పందించిన షారుక్ "మా గాళ్ ఫ్రెండ్స్ మాకే" అంటూ సరదాగా కామెంట్ చేశాడు. "సమాధానం చెప్పను" అనే సీరియస్ జవాబుకు బదులు బాలీవుడ్ బాద్షా హ్యూమరస్‌గా స్పందించడం అందరినీ ఆకట్టుకుంది. బ్రిటన్ లో ఒకే విద్యాసంస్థలో చదువుకుంటున్నారు ఆర్యన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య. తరచూ వీరిద్దరూ ఫ్రెండ్స్‌ తో దర్శనమిస్తుంటారు. ఇక పార్టీలు, టూర్స్‌ లో వీరు చేసే హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. ఆర్యన్ అమ్మాయిలతో ఉన్న ఫొటోలు అప్పుడప్పుడూ వైరల్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ అభిమాని అతడి స్నేహితురాళ్ల గురించి తండ్రి షారుక్‌ను ఆరా తీశాడు. డేటింగ్ పైనా ఆ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు, అలాంటి విషయాల్లో నాకంత అనుభవం లేదంటూ కింగ్ ఖాన్ బదులిచ్చాడు. అమ్మాయిల విషయంలో నేను కాస్త బలహీనుణ్ణి అంటూ కామెంట్ చేశాడు.

No comments:

Post a Comment

About

Flickr