Nestham Movie Creations

Saturday, 12 November 2016

పవన్.. ఈ కన్ఫ్యూజన్ కాస్త తీర్చరాదూ


పవన్.. ఈ కన్ఫ్యూజన్ కాస్త తీర్చరాదూపవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రహ్మపదార్థం. ఎవరికీ అర్థం కాడు. అతడి మనసులో ఏముందో తెలియదు. ఐతే వ్యక్తిగతంగా ఎలా ఉన్నా ఓకే కానీ.. తన సినిమా విషయంలోనూ అందరినీ అయోమయంలోకి నెడుతుంటాడు. గత కొన్నేళ్లుగా పవన్ ఎవరితో సినిమా చేస్తాడు.. ఏ సినిమా ఎప్పుడు మొదలుపెట్టి ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే విషయంలో గందరగోళం సాగుతోంది. తాజాగా పవన్ 'కాటమరాయుడు' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీని రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే తమిళ దర్శకుడు టీఎన్ నీశన్ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టేశాడు పవన్. ఈ రెండు సినిమాల కథాంశాలేంటనే విషయంలో పెద్ద సస్పెన్స్ నడుస్తోంది. 'కాటమరాయుడు' అజిత్ నటించిన తమిళ హిట్ మూవీ 'వీరం'కు రీమేక్ అన్న ప్రచారం మొదట్నుంచి జరుగుతోంది. పవన్ క్యారెక్టరైజేషన్ గురించి.. ఈ సినిమాలో మిగతా పాత్రల గురించి వస్తున్న సమాచారం చూస్తుంటే ఇది 'వీరం" రీమేకే అని అంతా ఫిక్సయిపోయారు. ఐతే ఇది 'వీరం" రీమేక్ కాదంటూ ఖండన ఇచ్చింది 'కాటమరాయుడు' టీమ్. మరోవైపు నీశన్ దర్శకత్వంలో మొదలైన సినిమా అజిత్ సినిమానే అయిన 'వేదాలం'కు రీమేక్ అంటున్నారు. కానీ ఈ విషయంలో కూడా గందరగోళం నెలకొంది. నీశన్ తన దర్శకత్వంలో వచ్చిన 'జిల్లా'నే పవన్తో రీమేక్ చేస్తున్నాడని.. 'వేదాలం' రీమేక్కు సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడని మరో ప్రచారం నడుస్తోంది. మొత్తానికి పవన్ సినిమాలన్నింటిపైనా కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చేదెవరో మరి.

No comments:

Post a Comment

About

Flickr