
'పక్కా లోకల్' వర్మ.. అలాంటి సినిమానా?
తెలుగు సినిమాతో దర్శకుడిగా పరిచయమైనా.. కాలక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించాడు రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమాలు కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లందరికీ పాఠాలే. గత కొన్నేళ్లలో వర్మ నుంచి చెత్త సినిమాలు వచ్చి ఉండొచ్చు. అవి దారుణమైన ఫలితాలు చూసి ఉండొచ్చు. ఐతే టేకింగ్ విషయంలో వర్మకు ఎప్పుడూ మంచి మార్కులే పడతాయి. చాలా తక్కువ బడ్జెట్లో సినిమాలు ఎలా చేయాలో.. టేకింగ్ తో ఎలా మాయ చేయొచ్చో వర్మ నుంచే తెలుసుకోవాలి. చాలామంది గమనించని విషయం ఏంటంటే.. వర్మ తన సినిమాలన్నింటినీ లోకల్ గానే తీస్తాడు. అవి సన్నివేశాలైనా సరే.. పాటలైనా సరే.
వర్మ తన సినిమాల షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లడం అన్నది అరుదైన విషయం. 'గోవిందా గోవిందా' సినిమాకు కథ రీత్యా ఫారిన్ వెళ్లారు. మిగతా వాటిలో ఏవో ఒకటీ అరా ఫారిన్ లొకేషన్లు కనిపించి ఉండొచ్చేమో. అలాంటిది ఇప్పుడు వర్మ ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్టు చేయబోతున్నారు. 'న్యూక్లియర్' పేరుతో ఏకంగా రూ.340 కోట్లతో సినిమాకు ఆయన రంగం సిద్ధం చేశారు. ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌజ్ వర్మతో ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఈ సినిమా కథాంశం కూడా అంతర్జాతీయ స్థాయిదే. సినిమా కూడా అనేక దేశాల్లో చిత్రీకరణ జరుపుకోబోతోంది. ఇప్పటిదాకా లోకల్ సినిమాలు తీస్తూ.. లోకల్ గానే ఉన్నా.. ఒక్కసారిగా ఇలా అంతర్జాతీయ కథాంశంతో.. అంతర్జాతీయ సినిమా చేయడం చిత్రమైన విషయం. మరి వర్మ తొలిసారి చేస్తున్న ఫుల్ లెంగ్త్ ఇంటర్నేషనల్ మూవీలో తన పనితనాన్ని ఎలా చూపిస్తాడో చూడాలి
No comments:
Post a Comment