
ఒకప్పుడు ఐటెం సాంగ్స్‌ను.. ఐటెం భామలను చాలా తక్కువగా చూసేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. టాప్ హీరోయిన్లు సైతం ఐటెం భామల అవతారం ఎత్తేస్తున్నారు. తమన్నా.. శ్రుతి హాసన్.. కాజల్.. వీళ్లందరూ ఐటెం సాంగ్స్‌లో చిందేసిన వాళ్లే. వీరిలో శ్రుతి హాసన్ ఇటు తెలుగులో.. అటు హిందీలో ఐటెం సాంగ్స్‌కు చిందేసింది. తాజాగా ఆమె మరోసారి ఈ తరహా పాటలో ఆడిపాడబోతోంది.
ఐతే శ్రుతి డ్యాన్స్ చేసేది ఎవరితోనో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్‌తో ఆమె ఐటెం సాంగ్ చేస్తోంది. నిఖిల్ తొలి సినిమా 'జాగ్వార్'ను రూ.75 కోట్ల ఖర్చుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఏ విషయంలోనూ రాజీ పడట్లేదు కుమారస్వామి. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ఎన్నెన్ని ఆకర్షణలు జోడించాలో అన్నీ జోడిస్తున్నాడు.
ఇందులో భాగంగానే శ్రుతి హాసన్‌తో ఐటెం సాంగ్ చేయిస్తున్నారు. పారితోషకం భారీగా ఆఫర్ చేయడంతో శ్రుతి ఈ పాటకు ఒప్పేసుకుంది. 'జాగ్వార్'కు తమన్ సంగీత దర్శకుడు. ఇంతకుముందు శ్రుతి తెలుగులో చేసిన ఐటెం పాట 'జంక్షన్లో..' కంపోజ్ చేసింది కూడా తమనే. ఇప్పుడు మరో ఊపున్న పాట రెడీ చేశాడట. 'మిత్రుడు' ఫేమ్ మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న 'జాగ్వార్'కు విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం
shruthi nuvu dinike set avuthavu
ReplyDelete