
మంచు వారసురాలు లక్ష్మీ ప్రసన్న సినిమాల్లోనే కాకుండా.. టెలివిజన్ రంగంలో కూడా సత్తా చాటుతోంది. సినిమాలు తీయడం నటించడంతో పాటే.. టీవీల్లో టాక్ షోలతోనూ సక్సెస్ ఫుల్ పర్సన్ గా పేరు తెచ్చుకుంది. ప్రేమతో మీ లక్ష్మితో స్టార్ట్ చేసి - లక్కుంటే లక్ష్మి - దూసుకెళ్తా - బూమ్ బూమ్ వంటి కార్యక్రమాలను దిగ్విజయంగా డీల్ చేసిన అనుభవం ఉంది. అలాగే ఈమెకు సామాజిక సేవపై కూడా మక్కువ ఎక్కువ. చెన్నై వరదల సయమంలో మేము సైతం అంటూ ఓ కేంపెయిన్ ను టాలీవుడ్ తరఫున నడపడంలో.. లక్ష్మీ మంచు కీలక పాత్ర పోషించింది. ఇదే కాకుండా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్న అనుభవం మంచితనం ఆమె సొంతం. అందుకే ఓ ఎంటర్ టెయిన్ మెంట్ ఛానల్.. మేముసైతం అంటూ ప్రారంభించబోతున్న కార్యక్రమానికి తొలి ఆప్షన్ గా ఈమెనే ఎంచుకుంది.
ఇప్పటివరకూ లక్ష్మి చేసిన ప్రయత్నం వల్ల నిజంగా అద్బుతమైన ఫలితాలే వచ్చాయి. కొన్ని కుటుంబాలకు అత్యవసర సమయాల్లో సహాయం అందుఇంది. కొందరు పిల్లలకైతే చదువు పూర్తి అయ్యే దాకా మేము అండగా ఉంటాం అంటూ ఒక బరోసా వచ్చింది. హీరోలనూ, సినీ సెలబ్రిటీలనూ ఒప్పించి రోడ్దుమీదకి తీసుకు రావటం లో మంచులక్ష్మి పాత్ర ఖచ్చితంగాఉంది. ఒకరి తర్వాత ఒకరుగా వస్తున్నారు అయితే యువనటులు రావటం పాల్గొనటం వరకూ ఓకేగానీ విజయనిర్మల లాంటి సీనియర్ నటి , దర్శకురాలు కూడా జనం లోకి రావటం ఆశ్చర్యం కలిగించే విశయమే... ఇంతకీ ఆమె ఏం చేసారూ అంటే.....
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి:
సూపర్ స్టార్ కృష్ణ సతీమణి:
జెమిని టీవీలో ప్రసారమయ్యే "మేము సైతం" కార్యక్రమం కోసం సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల పాప్ కార్న్ అమ్మే పనిలో పడ్డారు. హైదరాబాద్ లోని ఒక ఏరియాలో ఆమె రోడ్డు మీదికి వచ్చి పాప్ కార్న్ అమ్మకాలు చేపట్టారు. ఇంత వయసులోనూ ఒక మంచి కారణం కోసం విజయ నిర్మల లాంటి ఒక సెలబ్రిటీ రోడ్దు మీద నిలబడటం చాలా మందినే కదిలించింది
No comments:
Post a Comment