Nestham Movie Creations

Friday, 11 November 2016

రెజీనా తల్లైంది.. ఆమె కొడుకుని చూశారా


రెజీనా తల్లి అవడం ఏంటి ఇంకా పెళ్లి కాకుండానే అని ఆశ్చర్యపడటం కామనే కాని రెజీనా తల్లి అయ్యింది రియల్ లైఫ్‌లో కాదు రీల్‌లైఫ్‌లో తల్లి పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే తెలుగులో తన హవా చూపిన రెజీనా తమిళంలో కూడా ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. ప్రస్తుతం రెజీనా తమిళ్‌లో "నెంజం మరప్పథిల్లై" అనే సినిమా చేస్తోంది. దీనిలో దర్శకుడు ఎస్‌జే సూర్య ప్రధానపాత్రలో నటిస్తుండగా సెల్వరాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది అందులో రెజీనా ఓ బాబుకు తల్లిగా కనిపించి వార్తల్లో నిలిచింది. తెలుగు, తమిళ భాషాల్లో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కేవలం గ్లామరస్ పాత్రలతోనే సరిపెట్టకుండా కథా ప్రాధాన్యత ఉన్న రోల్‌లో నటించడానికి తాను సిద్ధం అని ఈ సినిమా ద్వారా తెలియజేసింది రెజీనా. అంతేకాదు ఆ సినిమాలో రెజీనా దయ్యం పాత్రతో బయపెట్టబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ఆ ట్రైలర్ మీకోసం.

No comments:

Post a Comment

About

Flickr