Nestham Movie Creations

Saturday, 12 November 2016

ఆ హీరోయిన్ మేక‌ప్ కోసం ఆరుగురు

ఆ హీరోయిన్ మేక‌ప్ కోసం ఆరుగురు
బాలీవుడ్లో మోస్ట్ సెక్సీయెస్ట్ హీరోయిన్ల లిస్టు తీస్తే అందులో సోనమ్ కపూర్ పేరు కచ్చితంగా ఉంటుంది. తొలి సినిమా ‘సావరియా’లో ఆమెను చూసి చాలా ట్రెడిషనల్ అనుకున్నారు కానీ.. ఆమెలోని కొత్త కోణాలు తర్వాత తర్వాతే తెలిశాయి. తన హాట్ హాట్ అందాల్ని ఓ రేంజిలో ఆరబోస్తూ బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది సోనమ్. ఐతే ఇప్పుడు ఇంత సెక్సీగా కనిపిస్తున్న సోనమ్.. ఒకప్పుడు మాత్రం చాలా అసహ్యంగా ఉండేదట. ఆ మాట ఎవరో చెప్పట్లేదు. స్వయంగా సోనమే అంటోంది. అసలు తనను చూసి.. ఈ అమ్మాయికి పెళ్లే కాదేమో అని కూడా కామెంట్లు చేసేవాళ్లని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘నా టీనేజీలో నేను ఏమంత అందంగా ఉండేదాన్ని కాదు. అబ్బాయిల కంటే పొడుగుండేదాన్ని. పైగా లావు కూడా ఎక్కువ. అందులోనూ నా రంగు కూడా తక్కువే. దీంతో ఎక్కడికైనా వెళ్లాలన్నా సిగ్గుగా అనిపించేది. ఫ్యామిలీ ఫంక్షన్లకు వెళ్లినపుడు అసలీ ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా.. అని గుసగుసలాడేవాళ్లు కూడా. అందుకే బాలీవుడ్లోకి వచ్చే ముందు చాలా ఆలోచించాను. నన్ను నేను మార్చుకున్నాను. తిండి కంట్రోల్ చేసి తగ్గాను’’ అని సోనమ్ చెప్పింది. ఇక ఇప్పుడు కూడా తానేమీ పెద్ద అందగత్తెను కాదని.. అందరు హీరోయిన్ల లాగే తనకు కూడా మేకప్ అవసరం చాలా ఉంటుందని ఆమె అనడం విశేషం. ‘‘చాలామంది అమ్మాయిలు ఉదయం నిద్రలేవగానే తమ ముఖాన్ని చూసుకొని ఫీలవుతుంటారు. హీరోయిన్లలా అందంగా లేమే అని బాధపడుతుంటారు. ఐతే నిద్ర నిద్రలేవగానే హీరోయిన్లు కూడా సాధారణ అమ్మాయిల్లానే ఉంటారు. దానికి నేనూ మినహాయింపు కాదు. నేను ఓ కార్యక్రమం కోసం బయటికి వెళ్లాలంటే.. గంటన్నర పాటు మేకప్‌ వేసుకోవాల్సిందే. నా మేకప్‌ కోసమే ఆరుగురు పనిచేస్తారు’’ అని వెల్లడించిందామ

No comments:

Post a Comment

About

Flickr