Nestham Movie Creations

Saturday, 12 November 2016

నాగ్ కంటే ముందు రానాకే తెలుసట

నాగ్ కంటే ముందు రానాకే తెలుసట
కొన్ని నెలల కిందట ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో నేను ప్రేమలో ఉన్నానని.. అతడినే పెళ్లి చేసుకోబోతున్నానని.. సమంత వెల్లడించగానే అందరికీ దిమ్మదిరిగిపోయింది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించగానే అది నాగచైతన్యే అని అర్థమైపోయింది. ఐతే కొన్నేళ్ల నుంచి క్లోజ్‌గా ఉంటున్న వీళ్లిద్దరి గురించి బయటి ప్రపంచానికి తెలియకపోవడం ఆశ్చర్యమే. నాగార్జునకు కూడా వీళ్ల వ్యవహారం ఆలస్యంగానే తెలిసిందట. ఐతే నాగ్ కంటే ముందుగా చైతూ-సమంతల ప్రేమాయణం గురించి చైతూ కజిన్ రానా దగ్గుబాటికే ముందు తెలుసట. ఈ విషయాన్ని చైతూనే స్వయంగా వెల్లడించాడు. ''మా సంగతి రానాకి ముందే తెలుసు. రానా నా కజిన్. పైగా క్లోజ్‌ ఫ్రెండ్‌ కూడా. ఇద్దరం కలిసి పెరిగాం. తనకు నేను, సమంత ఎంత క్లోజో తెలుసు. ఐతే మా విషయం పెద్దలకి మాత్రం నేనే చెప్పా. ముందు నాన్నకే ఈ విషయం తెలియజేశాను. ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు'' అని చైతూ చెప్పాడు. ఇక తన పెళ్లి గురించి ఆలోచించినపుడు సమంత తప్ప తనకెవరూ గుర్తు రాలేదని చైతూ చెప్పాడు. ''నాకు 30 ఏళ్ళొచ్చాక జీవితం గురించి ఆలోచించడం మొదలుపెట్టా. ఓ వైపు సినిమాలున్నా.. నా వ్యక్తిగత జీవితం కూడా కీలకం అనిపించింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నా. ఎంత ఆలోచించినా సమంత తప్ప ఇంకే అమ్మాయీ గుర్తురాలేదు. అప్పుడు ఆ అమ్మాయే నా జీవిత భాగస్వామి అని నాకు నేను కన్ఫమ్ చేసుకున్నా. తర్వాత సమంత దగ్గరికెళ్లి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాను'' అని చైతూ వెల్లడించాడు

No comments:

Post a Comment

About

Flickr